న్యూఢిల్లీ : లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన తీరుపై విపక్షాలు తీవ్రస్థాయిలో అభ్యంతరం చెబుతున్నాయి. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టినట్లు తాము అంగీకరించబోమని స్పష్టం చేశాయి. బిల్లు సభలో ప్రవేశపెట్టినట్లా?...ప్రవేశపెట్టనట్టా? అనే అంశంపై ఓటింగ్ పెట్టాలని విపక్షాలు స్పీకర్ మీరాకుమార్కు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు దీనిపై ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు డివిజన్ కోరాయి.