అభిప్రాయాలు తెలిపిన తరువాతే అఖిలపక్షం: షిండే
ఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై అభిప్రాయాలు పంపాలని ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పక్షాలకు హొం శాఖ లేఖలు పంపింది. తెలంగాణపై కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం(జిఎంఓ) విధివిధానాలపై అభిప్రాయాలు పంపాలని ఆ లేఖలలో పేర్కొన్నారు. నవంబర్ 5కల్లా అభిప్రాయాలు పంపాలని హొం శాఖ విజ్ఞప్తి చేసింది. 7వ తేదీన జిఎంఓ సమావేశం కానున్నందున, ఆ లోపలే అభిప్రాయాలు పంపాలని హొం శాఖ కోరింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు పంపిన తరువాత అఖిలపక్ష సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు వచ్చే వారంలో రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు షిండే నిన్న చెప్పారు. జిఎంఓ సమావేరశానికి ముందే సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. మళ్లీ ఈరోజు వారి అభిప్రాయాలు తెలిపిన తరువాతే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.