
రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ సూచించిన హొం శాఖ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు కేంద్ర హొం మంత్రిత్వ శాఖ రాజ్యాంగ సవరణను సూచించింది. విభజనకు సంబంధించి నియమించిన మంత్రుల బృందం(జీఓఎం)కు హొం మంత్రిత్వ శాఖ ఒక నివేదిక సమర్పించింది. 85 పేజీల ఈ నివేదికలో ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించింది. హైదరాబాద్, వనరుల పంపిణీ, సాగు నీరు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డిలను ముఖ్యమైన అంశాలుగా హొం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అవసరమైతే ఆర్టికల్ 371డిని సవరించాలని సూచన చేసింది.
ఈ నాలుగు అంశాల విషయంలో స్పష్టత వస్తే విభజన సాధ్యమేనని ఆ శాఖ తెలిపింది. ఇంకా ఈ నివేదికలో శాసన, పాలన, న్యాయపరమైన అంశాలను ప్రస్తావించింది.