సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మంగళవారం కోవిడ్ బాధితులు ఉన్న ఆసుపత్రులతో విజయవాడలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, ఆహారం, మంచినీరు ఎలా అందిస్తున్నారని స్వయంగా పేషేంట్లను అడిగి తెలుసుకున్నారు. నాని అడిగిన ప్రశ్నలకు పేషెంట్లు స్పందిస్తూ... 'ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితులకు అద్భుతమైన సేవలందిస్తున్నారు. సమయానికి మందులు ఇస్తూనే ఎప్పటికప్పుడు శానిటైజేషన్ నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. భోజనం , టిఫిన్ సమయానికి అందిస్తున్నారు. మంచి నాణ్యత గల పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. కోవిడ్ పేషెంట్లకు ప్రభుత్వం అద్భుతంగా సేవలందిస్తోంది.మంచి ఆహారం.. నీరు అందిస్తున్నారు.మాకు ఎటువంటి ఇబ్బంది లేదు' అంటూ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment