ఏలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 66 రోజుల పాటు చరిత్రాత్మకమైన పోరాటం చేసిన ఏపీ ఎన్జీవో నేతలు సమైక్య ఉద్యమానికి ఉమ్మడి వేదికను నెలకొల్పి ఉంటే బాగుండేదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం జీతాలను వదులుకుని, పస్తులుండి మరీ సమ్మె చేశారని కొనియాడారు. వారి ఆందోళనలు, చేసిన పోరాటం రాష్ట్ర చరిత్రలో ఎవరూ మరచిపోలేనిదని అన్నారు.
ఈ స్థాయి ఉద్యమాన్ని నిర్మించిన నేతలు అన్ని రాజకీయ పార్టీలను ఒకచోటకు చేర్చే వేదికను ఉద్దేశపూరకంగానే ఏర్పాటు చేయలేదనే అనుమానాలున్నాయని చెప్పారు.