జగన్ కుప్పం వెళ్తే చంద్రబాబుకు ఎందుకంత భయం? | Ambati Rambabu takes on chandrababu naidu over united state | Sakshi
Sakshi News home page

జగన్ కుప్పం వెళ్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?

Published Tue, Nov 19 2013 4:22 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

జగన్ కుప్పం వెళ్తే చంద్రబాబుకు ఎందుకంత భయం? - Sakshi

జగన్ కుప్పం వెళ్తే చంద్రబాబుకు ఎందుకంత భయం?

సమైక్యం అనే అక్షరాలు పలకడానికి చంద్రబాబు ఎందుకంత సందేహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. జగన్‌ కుప్పం వెళ్తున్నారంటే బాబుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. కుప్పం ప్రజలు చంద్రబాబుని చొక్కాపట్టుకుని ప్రశ్నించాలని కోరారు. ''చంద్రబాబూ...నీవు నిప్పులా ఎప్పుడు బతికావో చెప్పు? అందర్నీ మోసం చేసే నువ్వు నిప్పు అవుతావా? రాష్ట్రం విడిపోయినా, కలిసున్నా ఏ ప్రాంతంలోనూ ముఖ్యమంత్రివి కావన్న విషయం నీకూ తెలుసు'' అని ఆయన విమర్శించారు.

పైకి సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నట్లు గొప్పలు చెప్పుకొంటూ.. లోలోపల మాత్రం విభజనకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా అంబటి రాంబాబు మండిపడ్డారు. కొన్ని పనికిమాలిన పత్రికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement