సోషల్‌మీడియాకు సంకెళ్లా? | Ambati rambabu slams babu on ravikiran arrest | Sakshi
Sakshi News home page

సోషల్‌మీడియాకు సంకెళ్లా?

Published Fri, Apr 21 2017 12:37 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

సోషల్‌మీడియాకు సంకెళ్లా? - Sakshi

సోషల్‌మీడియాకు సంకెళ్లా?

అమరావతి: సోషల్‌మీడియాకు సంకెళ్లు వేయాలనుకుంటే అది అధికార పార్టీ పిచ్చితనం అవుతుందని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అన్నారు. మీడియాను లోబర్చుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్‌మీడియాను తన అదుపులోకి తెచ్చుకోవాలని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు.

యూట్యూబ్‌లో పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌ అరెస్టు దుర్మార్గమని అన్నారు. సోషల్‌మీడియా బాబు, లోకేష్‌లు భయపడుతున్నారనడానికి రవికిరణ్‌ అరెస్టే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలను వెలుగులోకి తెస్తే అరెస్టు చేస్తార? అని ప్రశ్నించారు. రవికిరణ్‌కు వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement