ravikiran
-
37 మంది జైలు వార్డర్లపై క్రమశిక్షణా చర్యలు
ఆరిలోవ (విశాఖ జిల్లా): విశాఖ కేంద్ర కారాగారంలో నిబంధనలు ఉల్లంఘించిన 37 మంది వార్డర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు జైళ్ల శాఖ కోస్తాంధ్ర రీజియన్ డీఐజీ రవికిరణ్ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎం.మహేశ్‌బాబు అవమానించారని.. విధి నిర్వహణలో కఠినంగా ఉంటున్నారంటూ వార్డర్లు తమ కుటుంబసభ్యులతో జైలు ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీఐజీ రవికిరణ్ శనివారం అర్ధరాత్రి రాజమండ్రి నుంచి విశాఖకు చేరుకున్నారు.వార్డర్లతో, జైలు సూపరింటెండెంట్‌తో చర్చించారు. ఆదివారం ఉదయం జైలును సందర్శించి.. ఖైదీలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జైలులో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయన్నారు. జైలు లోపలకు నిషేధిత వస్తువులు తెచ్చారని అనుమానం వస్తే.. ఎవరినైనా వెంటనే తనిఖీ చేయవచ్చని చెప్పారు. అందులో భాగంగా సూపరింటెండెంట్ సమక్షంలో డిప్యూటీ సూపరింటెండెంట్.. ఇద్దరు వార్డర్లను తనిఖీ చేశారని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి జైల్ ముందు ధర్నా చేసి.. విధులకు గైర్హాజరైన 37 మంది వార్డర్లను రాష్ట్రంలోని వేర్వేరు జైళ్లకు బదిలీ చేశామన్నారు. -
చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): చంద్రబాబుకు సెంట్రల్ జైల్లో పూర్తి భద్రత ఉందని, దీనిపై అవాస్తవ వార్తలను నమ్మొద్దని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం, ఆయనను చంపేస్తామంటూ మావోల పేరుతో వచ్చిన లేఖ, జైల్లో పెన్ కెమెరాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సెంట్రల్ జైల్లో శుక్రవారం రాత్రి వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని, 24 గంటలూ సెక్యూరిటీతో పాటు అడిషనల్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఈ నెల 19న చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో ఆయనను బ్లూ జీన్ యాప్ ద్వారా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టామని, అందులో చంద్రబాబు కొన్ని విషయాలను న్యాయమూర్తికి తెలిపారని, వాటిని లెటర్ రూపంలో తిరిగి ఆయన ఇస్తే దానిని తాము కోర్టుకు పంపామన్నారు. జైలు చుట్టూ ఐదు వాచ్‌టవర్స్ ఉన్నాయని, గంటకోసారి గార్డ్ సెర్చ్ జరుగుతోందని చెప్పారు. జైలు వాటర్ ట్యాంక్ వైపు డ్రోన్ తిరిగినట్టు నార్త్ ఈస్ట్ వాచ్‌టవర్ గార్డు నుంచి సమాచారం వచ్చిందని, అయితే ఆ డ్రోన్ క్లోజ్డ్ జైలు వైపు రాలేదని, దీనిపై సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతోందన్నారు. మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీది.. చంద్రబాబును చంపేస్తామంటూ మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీదిగా గుర్తించినట్టు తెలిపారు. జైలు నుంచి చంద్రబాబు రాశారంటూ బయటకొచ్చిన లెటర్‌కు జైలు ముద్ర, సూపరింటెండెంట్ సంతకం లేదన్నారు. చంద్రబాబు ప్రింటెడ్ సంతకాన్ని తీసి దానిపై వేసి వైరల్ చేస్తున్నారని తెలిపారు. అలాగే జైల్లోకి వచ్చే ప్రతి ఖైదీని పూర్తిగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తామన్నారు. శ్రీనివాస్ అనే ఖైదీ రిమాండ్‌కు వచ్చినప్పుడు అతని వద్ద ఒక బటన్ కెమెరా ఉన్నట్టు గుర్తించామన్నారు. జైలు లోపలికి అనుమతించే ముందు అతని దుస్తులు తనిఖీ చేస్తుంటే అది లభించిందని తెలిపారు. అందులో ఎలాంటి జైలు ఫుటేజీ లేదని, ఆ కెమెరాను స్వాదీనం చేసుకుని.. పోలీసులకు అప్పగించామని, ఆ కెమెరాను ఎందుకు తెచ్చారనే విషయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరారన్నది పూర్తి అవాస్తవమన్నారు. చంద్రబాబు కుడికంటి కేటరాక్ట్ ఆపరేషన్‌కు సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ వైద్యులు పరీక్షలు చేశారని, కొంతకాలం తర్వాత అయినా ఆపరేషన్ చేయించుకోవచ్చని తెలిపారని వివరించారు. ఆయన ఆరోగ్యంపై తప్పుడు రిపోర్టులు విడుదల చేయడంలేదని, వాటిని ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిస్తున్నట్టు తెలిపారు. జైల్లో చంద్రబాబును తాము కలవాలన్నా ఏడుగురు అధికారులు కలిస్తేనే.. అది సాధ్యమన్నారు. చంద్రబాబు తనకున్న ఎలర్జీలపై గతంలో ప్రభుత్వ వైద్యులకు చెప్పారని, దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు రెండు లెటర్లు కూడా రాశామన్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి ఎలాంటి చికిత్స అవసరమో తెలపాలని ఆయన భార్య భువనేశ్వరికి, ఇదే విషయాన్ని కోర్టుకూ తెలియజేసినట్టు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలు బయట సైతం 24 గంటలూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పకడ్బందీగా గస్తీ ఏర్పాటు చేసినట్టు రవికిరణ్, జగదీ‹Ù వివరించారు. -
అనుబంధాలు.. వెటకారాలు
‘‘నాది తూర్పుగోదావరి జిల్లా భద్రవరం. నేను ఎవరి దగ్గరా దర్శకత్వశాఖలో చేయలేదు. ఇంటర్నెట్ నుంచి సమాచారం సేకరిస్తూ, షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ సినిమాని తెరకెక్కించడం ఎలాగో నేర్చుకున్నా’’ అని డైరెక్టర్ రవికిరణ్ అన్నారు. కిరణ్ అబ్బవరమ్, రహస్యగోరక్ హీరోహీరోయిన్లుగా డి. మనోవికాస్ నిర్మించిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా నవంబర్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రవికిరణ్ మాట్లాడుతూ– ‘‘ఊరి నుంచి హైదరాబాద్ వచ్చాక సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. కథ కంటే కథనం బాగుండాలి. చిన్న అంశాల చుట్టూ సన్నివేశాలు అల్లుకుని ప్రేక్షకులను మెప్పించడం నాకు ఇష్టం. నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి అక్కడి అనుబంధాలు, రాజకీయాలు, వెటకారాలు తెలుసు. అందుకే ఈ నేపథ్యంలో కథ అల్లుకున్నా. మా సినిమా చూసినవారిలో కొందరు ‘తొలిప్రేమ’ చిత్రంలా ఉందనడం ఆనందంగా ఉంది. నా తర్వాతి చిత్రం కోసం రాజకీయ నేపథ్యంలో ఓ కథ సిద్ధం చేసుకుంటున్నా’’ అన్నారు. -
రవికిరణ్‌తో ముడిపెట్టేలా ప్రశ్నించారు
గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ ఇంఛార్జి మధుసూదన్ రెడ్డి, రవికిరణ్‌లను విచారించారు. విచారణకు పిలిచినపుడు మళ్లీ హాజరుకావాలంటూ పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. విచారణానంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. రవికిరణ్‌కు, వైఎస్ఆర్ సీపీకి ముడిపెట్టేలా ప్రశ్నలు అడిగారని చెప్పారు. రవికిరణ్‌తో వైఎస్ఆర్ సీపీకి సంబంధం లేదని మరోసారి చెప్పానని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి రవికిరణ్ సహా చాలామంది వాలంటీర్లు ఉన్నారని, అయితే వాళ్లందరినీ పోలీసులు ఉద్యోగులుగా భావిస్తున్నారని చెప్పారు. టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌పై మరోసారి ఫిర్యాదు చేసినా, పోలీసులు స్వీకరించలేదని మధుసూదన్ రెడ్డి తెలిపారు. పోలీసులు ఒత్తిడికి తలొగ్గుతున్నారు: పోలీసులు వివక్షతతో వ్యవహరిస్తున్నారని, వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదులను స్వీకరించడం లేదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. చట్టపరంగా ఎవరు ఫిర్యాదు చేసినా స్వీకరించాలని, పోలీసులు ఒత్తిడికి తలొగ్గుతున్నారని చెప్పారు. రవికిరణ్‌కు వైఎస్ఆర్ సీపీతో లింక్ పెట్టేలా ప్రయత్నిస్తున్నారని, అదే కోణంలో విచారణ జరుగుతోందన్నారు. -
రవికిరణ్‌కు, మాకు ఎలాంటి సంబంధం లేదు
-
జైల్లో వేస్తాం.. మొద్దుశీనులా జరగొచ్చు!
► రవికిరణ్‌కు పోలీసుల బెదిరింపులు ► విచారణ పేరిట వేధింపులు సాక్షి, అమరావతి బ్యూరో: ‘మేము తలచుకుంటే ఏదైనా చేస్తాం.. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తాం.. జైల్లో వేస్తాం.. ఎక్కువ రోజులు జైల్లో ఉండేలా చూస్తాం.. అక్కడ నీ పక్కన ఉండే ఖైదీ ఏమైనా చేయొచ్చు.. మొద్దుశీనులా ఏదైనా జరగొచ్చు.. అప్పుడు మాకేమీ సంబంధం ఉండదు..’ అని గుంటూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ‘పొలిటికల్ పంచ్’ ఫేస్బుక్ పేజీ అడ్మిన్ రవికిరణ్‌ను బెదిరించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి శనివారం తెల్లవారుజాము వరకు వివిధ రకాలుగా వేధించి.. బెదిరించి.. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నానని ఒప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేసిన తీరును రవికిరణ్ శనివారం ‘సాక్షి’కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మందడం స్టేషన్లో ఉంచారు.. ‘‘శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు మా ఇంటికి వచ్చారు. నీ మీద ఒక కేసు ఉంది. గుంటూరు రావాలని నన్ను తీసుకెళ్లారు. కేసు ఏమిటని పోలీసులను అడిగినా సమాధానం చెప్పలేదు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మందడం పోలీసు స్టేషన్లో ఉంచారు. అక్కడ నా పేరు, ఇతర వివరాలు అడిగారు. అప్పుడు మరోసారి ‘నాపై కేసు ఏంటి సార్’ అని అడిగితే.. శాసనసభను కించపరుస్తూ పోస్టు పెట్టావు. దానిపై మాకు ఫిర్యాదు ఇచ్చారని చెప్పారు. పోస్టింగుపై పోలీసులకు వివరణ ఇచ్చాను. శాసనసభ, మండలిని అవమానించడం నా ఉద్దేశం కాదని వివరించాను. పెద్దల సభ అంటే.. పెద్దల సినిమాగా భావించడం వల్లే లోకేష్ అందులో కూర్చుంటానని అడుగుతున్నాడన్న భావనతోనే పోస్టింగ్ పెట్టానని వివరణ ఇచ్చాను. లోకేష్ మీద అది సెటైర్ మాత్రమే గాని, చట్టసభను అవమానపరచడం కాదని చెప్పాను. ఈ పోస్టింగ్ తగదని కామెంట్లు వచ్చాయని, వెంటనే ఆ పోస్టింగ్ తొలగించానని చెప్పా. ఇది జరిగి కూడా 2 నెలలు అయిందన్నాను. ఆ తర్వాత ఎవరో వస్తున్నారని పేర్కొంటూ నన్ను భవనంలోని రెండవ అంతస్తుకు తీసుకెళ్లి కూర్చొబెట్టారు. వాహనాలు మార్చుతూ 4 గంటలు తిప్పారు... మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్టేషన్ వెనుకవైపు నుంచి నన్ను తీసుకెళ్లి ఆటోలో కూర్చొబెట్టి అరకిలోమీటర్ దూరం తీసుకెళ్లాక.. అక్కడ మారుతీ స్విఫ్ట్ కారులోకి మార్చారు. అక్కడి నుంచి ఓ 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాక.. బ్లాక్ స్కార్పియో వాహనంలోకి నన్ను మార్చి.. సీఎం నివాస ప్రాంతం కరకట్ట చుట్టూ సుమారు 4 గంటలపాటు తిప్పారు. తర్వాత సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పారు. కొంత దూరం వెళ్లాక.. ఓ ఆయిల్ కంపెనీ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడికి పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. మళ్లీ నా వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ డబ్బులిస్తే నీవు పొలిటికల్ పంచ్ ను నిర్వహిస్తున్నావు కదా? జగన్ కోసం పనిచేస్తున్నావు కదా? అంటూ నన్ను పలు విధాలుగా ప్రశ్నించారు. నేను సొంతంగా రెండున్నరేళ్లుగా పొలిటికల్ పంచ్ ఫేస్బుక్ పేజీ నిర్వహిస్తున్నాను. నేను వృత్తిపరంగా వెబ్ డిజైనర్‌ని. కాబట్టి డిజైన్స్ అవసరమైతే.. డబ్బులు తీసుకొని చేసి ఇస్తా. వైఎస్సార్సీపీకి కూడా వెబ్ డిజైనింగ్ చేసి ఇచ్చాను. టీడీపీ డబ్బులిస్తే.. వారికి కూడా డిజైనింగ్ చేసిపెడతాను. పొలిటికల్ పంచ్ ను మాత్రం ‘ఫ్రీలాన్సర్’గా నిర్వహిస్తున్నానని చెప్పాను. బెదిరించారు.. జైలులో పెడతామన్నారు.. ఎన్ని రకాలు ప్రశ్నించినా నేను ఒకటే సమాధానం చెప్పడంతో పోలీసులు బెదిరింపులకు దిగారు. లోకేష్ మీదే ఎందుకు పోస్టింగులు పెడుతున్నావన్నారు. లోకేష్‌పై ఇకపై పోస్టింగులు పెట్టొద్దన్నారు. సార్ లోకేష్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నారు కాబట్టి అతనిపై పోస్టింగులు పెడుతున్నాను. ఆయన అన్న మాటలపైనే పెట్టాను. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ట్రెండ్ అయినప్పుడు అతనిపైనా పోస్టింగులు పెట్టాను. ఇప్పటి వరకు పొలిటికల్ పంచ్‌లో 2,500 వరకు పోస్టింగులు పెట్టాను. అందులో లోకేష్‌పై ఒక 50 వరకు ఉండొచ్చు అన్నాను. అయినా పోలీసులు నామాటలను విశ్వసించలేదు. నిజం చెప్పకుంటే నీకే ఇబ్బందులన్నారు. నీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తామని, జైల్లో పెట్టిస్తామని చెప్పారు. అక్కడ మొద్దుశీనులా ఏదైనా జరగొచ్చని బెదిరించారు. చివరకు నిన్ను అరెస్టు చేయడం లేదని, నోటీసులు ఇస్తామని చెప్పారు. టైప్ చేసిన కాగితాలపై మూడు చోట్ల సంతకాలు పెట్టించుకున్నారు. 25వ తేదీన పోలీసుస్టేషన్‌కు వచ్చి నోటీసుపై సమాధానం చెప్పాలన్నారు. నేను సరే అన్నాను. అనంతరం పోలీసులు నన్ను శనివారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో శంషాబాద్‌లో దించేసి వెళ్లిపోయారు’’ అని రవికిరణ్ వివరించారు. -
రవికిరణ్ అరెస్టు దారుణం: ఏపీసీసీ
విజయవాడ: సోషల్ మీడియాను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వ, అరాచక ప్రయత్నాలను ఏపీసీసీ తీవ్రంగా ఖండించింది. పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్‌ను అక్రమ అరెస్టు చేసి వేధింపులకు గురిచేయడం పట్ల ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ ఖండించారు. శాసనమండలి భవనంపై అసభ్యకర ఫొటో పెట్టినట్టుగా ఫిర్యాదును సృష్టించి.. అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలు చంద్రబాబు నాయుడి అక్రమ పాలనా తీరుకు నిదర్శనమన్నారు. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా భంగం కలిగించి ఉంటే.. దానికి చట్టపరంగా అనేక పద్దతులున్నాయన్నారు. కానీ అధికారం చేతిలో ఉందికదా అని తమ ఇష్టానుసారం అక్రమ పద్దతులను వినియోగించుకుంటే ప్రజలు సహించరని మండిపడ్డారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడకుండా న్యాయస్థానాలు రవికిరణ్ అరెస్టు కేసును సుమోటో గా స్వీకరించి ప్రభుత్వాన్ని హెచ్చారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
స్వేచ్ఛకు సంకెళ్లా..?
► రాజధానిలో పోలీసుల అత్యుత్సాహం ► అధికార పార్టీ నేతల అండతో హడావుడి ► సామాన్యుడికి అన్యాయం జరిగినా నోరెత్తని ఖాకీలు ► రవికిరణ్‌ను అరెస్టుచేసి హైడ్రామా ► సోషల్ మీడియాలో లోకేష్‌ను కించపరిచారనే. సామాన్యుడు ఫిర్యాదుచేస్తే చూద్దాంలే అంటారు. చూసీచూడనట్టు పోతారు. భూములు కాజేస్తున్నారని, ప్రశ్నించినవారి పొలాలు నాశనం చేస్తున్నారని చెప్పినా స్పందించరు. కానీ, చినబాబు విషయంలో మాత్రం ఆగమేఘాలపై పరుగులు పెడతారు మన రాజధాని పోలీసులు. శుక్రవారం రాత్రి తుళ్లూరు పోలీస్‌స్టేషన్, మందడం ఏఎస్పీ కార్యాలయం వద్ద ఖాకీల అత్యుత్సాహం, హైడ్రామా స్వామిభక్తిని చాటింది. సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి అధికారపార్టీ నేతల దౌర్జన్యాలకు అడ్డాగా మారింది. టీడీపీ నేతల ఆగడాలకు ఖాకీలే సాక్షిగా మిగిలారు. రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి నేడు సోషల్‌మీడియాకు సంకెళ్లు వేయడం వరకు జరిగిన అనేక సంఘటనలే ఇందుకు నిదర్శనం. అమరావతి నిర్మాణానికి వేల ఎకరాలు కావాలంటూ రాజధానివాసుల మెడపై కత్తిపెట్టి మరీ బంగారంలాంటి వ్యవసాయ భూములు లాక్కున్నారు. జీవనాధారమైన భూములు పోగొట్టుకుంటే మేమెలా బతకాలని వ్యతిరేకించినా.. టీడీపీ పెద్దలు ఒప్పుకోలేదు. భయపెట్టి.. అక్రమ కేసులు బనాయించి.. ప్రశాంతంగా జీవించే స్వేచ్ఛను కాలరాశారు. భూములు తీసుకున్న వారికి పరిహారం పేరుతో ఇస్తామన్న ప్లాట్లలోనూ తీవ్ర అన్యాయం చేశారు. హామీలనూ తుంగలో తొక్కి విలువైన ప్లాట్లను టీడీపీ నేతలు కొట్టేశారు. ఊరికి దూరంగా, పొలిమేరల్లో విలువలేని ప్లాట్లను కట్టబెట్టారు. ఆన్లైన్ లాటరీ పేరుతో రాజధాని పరిధిలోని సామాన్యులను మోసం చేశారు. జరుగుతున్న మోసం గురించి మాట్లాడితే.. ప్రభుత్వ పెద్దల కనుసైగతో పోలీసులు రంగంలోకి దిగి తరిమేసే పరిస్థితి నెలకొంది. తమకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే స్వేచ్ఛను పోలీసుల సాక్షిగా కాలరాశారు. కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని సాగు చేసుకుంటున్న రైతులపైనా టీడీపీ నేతలు ప్రతాపం చూపారు. దౌర్జన్యంగా భూముల్లోకి ప్రవేశించి యంత్రాలతో పంటలను నాశనం చేయడం, తగులబెట్టి భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలూ అనేకం. బాధితులపైనే ఎదురు కేసులు సెంట్ల రూపంలో భూములు మాయం చేశారని బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఫిర్యాదు చేసిన బాధితులపైనే పోలీస్స్టేషన్లకు పిలిపించి, భయపెట్టి నోరెత్తకుండా చేసిన ఘనత ప్రభుత్వ పెద్దలకే దక్కింది. ఎన్నో ఏళ్ల నుంచి అనుభవంలో ఉన్న లంక, అసైన్డ్ భూములను కొట్టేసేందుకు చట్టాలను సైతం అతిక్రమిస్తున్నారు. అందరితో సమాన ప్యాకేజీకి లంక, అసైన్డ్ రైతులకు అర్హత లేదని వారి హక్కులను కాలరాస్తున్నారు. ఏడాదిలో ఐదు పంటలు పండే భూములను మెట్టగా మార్చి రైతులను మోసం చేస్తున్నా.. ఏ అధికారి, పోలీసులు పట్టించుకోరు. బాధిత రైతులు ఫిర్యాదు చేసినా న్యాయం చేయాల్సిన పోలీసులకు అవి కఠినంగా వినిపిస్తాయి. నదిలోని ఇసుకను యంత్రాలతో తవ్వరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా.. ఏపీ రాజధాని అమరావతిలో మాత్రం ప్రభుత్వ పెద్దలకు వినిపించవు, కనిపించవు. తమకు జరుగుతున్న అన్యాయాలపై రైతులంతా ఏకమై చర్చించుకోవాలని పలుమార్లు ప్రయత్నించినా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఉక్కుపాదంతో తొక్కేశారు. కళ్లముందే అనేక అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నా పోలీసులకు కనిపించలేదు. అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన 2013 భూ సేకరణ చట్టాన్నే టీడీపీ పెద్దలు సవరణలు చేశారు. రాజధాని పరిధిలో సేకరణకు అవకాశమే లేదని తెలిసినా వరుసగా భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి రైతులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు చేపట్టారు. రవికిరణ్ అరెస్టులో హైడ్రామా రకరకాలుగా తమ బాధలను చెప్పుకుంటున్నా కళ్లుండీ చూడని ప్రభుత్వ పెద్దలు, అధికారులు భావ ప్రకటనా స్వేచ్ఛపైనా ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్‌బాబును కించపరుస్తూ పోస్టు పెట్టారని ఫిర్యాదుపై రవికిరణ్ అనే వ్యక్తిని అరెస్టుచేసి శుక్రవారం అర్ధరాత్రి వరకు చూపించలేదు. రైతులు తమకు జరిగిన అన్యాయాలు, అక్రమాలపై ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా స్పందించని పోలీసులు సీఎం చంద్రబాబు కుమారుడిపై ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం వెంటనే స్పందించారు. 24 గంటలు కూడా గడవకముందే రవికిరణ్‌ను అరెస్ట్ చేశారు. సామాన్య జనం ఇచ్చిన ఫిర్యాదులపై ఇదే వేగంతో పోలీసులు స్పందించకపోవడం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తోంది. రవికిరణ్‌ను అరెస్టుచేసి తుళ్లూరు స్టేషన్‌కు తీసుకురావాల్సిఉన్నా.. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు హైడ్రామా నడిపించారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసి మీడియాని, ప్రజలను తప్పుదోవ పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అక్రమాలు, అన్యాయాలు, మోసాలకు అడ్డాగా మారుస్తుండటంపై స్థానిక ప్రజలు ప్రభుత్వ పెద్దలు, అధికారులపై మండిపడుతున్నారు. -
పొలిటికల్ పంచ్ రవికిరణ్ విడుదల
-
పొలిటికల్ పంచ్ రవికిరణ్ విడుదల
హైదరాబాద్: ఎట్టకేలకు ఏపీ పోలీసులు దిగొచ్చారు. పొలిటికల్ పంచ్ వెబ్సైట్ నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్(35)ను విడిచిపెట్టారు. గురువారం తెల్లవారుజామున సమయంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని తన నివాసంలో ఉన్న రవికిరణ్‌ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతనరం పోలీసులు నేరుగా మందడం ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లారని రవికిరణ్ వెల్లడించారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ప్రాతంలో ఆటోలో తీసుకెళ్లారని అనంతరం వేరువేరు వాహనాలు మారుస్తూ.. 3 గంటల పాటు సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో అటూ ఇటూ తిప్పారని తెలిపారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి విచారించారని రవికిరణ్ వెల్లడించారు.'పొలిటికల్ పోస్టింగ్‌ల వెనుక ఎవరున్నారు? సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడితే డబ్బులు ఇస్తారా? అని పోలీసులు ప్రశ్నించారని తెలిపారు. తాను పెట్టే పోస్టింగ్‌లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్‌పెట్టి ప్రశ్నలు వేశారని రవికిరణ్ వెల్లడించారు. అయితే పొలిటికల్ పంచ్ పోస్టింగ్‌లకు తనదే బాధ్యత అని పోలీసులతో పదేపదే చెప్పానని రవికిరణ్ అన్నారు. అందులోని ప్రతిపోస్టింగ్కు బాధ్యత తనదే అని, దీని వెనుక ఎవరి ప్రమేయం లేదని పోలీసులకు వెల్లడించినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా.. 25, 26వ తేదీల్లో మళ్లీ స్టేషన్‌కు రావాలని ఆదేశించిన పోలీసులు శనివారం తెల్లవారుజామున తన ఇంటివద్ద వదిలిపెట్టారని ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై అభ్యంతరకరంగా వెబ్సైట్లో ప్రచారం చేస్తున్నందుకుగాను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు అరెస్ట్ సమయంలో రవికిరణ్ భార్యతో వెల్లడించారు. రవికిరణ్ అరెస్ట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ప్రభుత్వ పనితీరు సరిగాలేదని విమర్శిస్తే అరెస్ట్‌లు చేయడం ఎంతవరకు సబబు అని నెటిజనులు ప్రశ్నించారు. -
సోషల్‌మీడియాకు సంకెళ్లా?
అమరావతి: సోషల్‌మీడియాకు సంకెళ్లు వేయాలనుకుంటే అది అధికార పార్టీ పిచ్చితనం అవుతుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అన్నారు. మీడియాను లోబర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్‌మీడియాను తన అదుపులోకి తెచ్చుకోవాలని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. యూట్యూబ్‌లో పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్టు దుర్మార్గమని అన్నారు. సోషల్‌మీడియా బాబు, లోకేష్‌లు భయపడుతున్నారనడానికి రవికిరణ్ అరెస్టే నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలను వెలుగులోకి తెస్తే అరెస్టు చేస్తార? అని ప్రశ్నించారు. రవికిరణ్‌కు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పారు. -
డీఎస్ఓ బాధ్యతల స్వీకరణ
కాకినాడ సిటీ : జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి (డీఎస్ఓ)గా నియమితులైన వేమూరి రవికిరణ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఎస్‌ఓగా పనిచేసిన జి.ఉమామహేశ్వరరావు అనంతపురం బదిలీ అయిన విషయం తెలిసిందే. విజయవాడ డీఎస్వోగా పనిచేస్తూ జిల్లాకు వచ్చిన రవికిరణ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణలను మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తూ ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తానన్నారు. ప్రధానంగా నగదురహిత సేవలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలిపారు. -
బాలికలే టార్గెట్
మాయమాటలు చెప్పి నగలు తీసుకొని ఉడాయింపు నాలుగేళ్లుగా 150 చోరీలు ఎట్టకేలకు పట్టుబడ్డ నిందితుడు అంబర్‌పేట: బాలికలకు మాయమాటలు చెప్పి నగలతో ఉడాయిస్తున్న ఘరాన దొంగను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఇతడి వద్ద నుంచి రూ. 7.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గత నాలుగేళ్లుగా 8 నుంచి 12 ఏళ్ల వయసు బాలికలను లక్ష్యంగా చేసుకొని, వారికి మాయమాటలు చెప్పి బంగారం , వెండి ఆభరణాలు ఎత్తుకెళ్తున్నాడు. శుక్రవారం ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ వి. రవీందర్, కాచిగూడ ఏసీపీ లక్ష్మీనారాయణతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... బర్కత్‌పుర, రత్నానగర్‌కు చెందిన బాతుల రవికిరణ్(28) అలియాస్ టింకు ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్. ఈ విధంగా వచ్చే జీతం సరిపోకపోవడంతో మీడియాలో వచ్చే క్రైమ్ కథనాలకు ఆకర్షితుడై నేరాలు చేయవచ్చనే ఆలోచనకు వచ్చాడు. 2012 నుంచి కాలనీలు, పాఠశాల వద్ద సంచరిస్తూ 8 నుంచి 12 ఏళ్ల బాలికను టార్గెట్ చేసి నేరాలకు పాల్పడుతున్నాడు. మీ తల్లిదండ్రులు నాకు బాగా తెలుసని, స్కాలర్షిప్లు, క్రీడాపరికరాలు బహుమతిగా ఇప్పిస్తానని బాలికలను నమ్మించి తన వాహనంపై కొంత దూరం తీసుకెళ్తాడు. మీ ఒంటిపై బంగారం ఉంటే స్కాలర్షిప్ ఇవ్వరని చెప్పి.. నగలు తీయించి, వాటిని పట్టుకొని ఉడాయిస్తున్నాడు. ఇలా ఇతను గత నాలుగేళ్లల్లో 150 చోరీలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని ఫొటోను సేకరించి మీడియాకు విడుదల చేశారు. ఈ ఫొటో చూసిన వారు రవికిరణ్ ఆచూకీని పోలీసులకు చేరవేశారు. పోలీసులు రత్నానగర్‌లో రవికిరణ్ ఉంటున్న ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు. అతని వద్ద రూ.7.10 లక్షలు విలువ చేసే 20 తులాల బంగారు ఆభరణాలు 2.7 కిలోల వెండి, ద్విచక్రవాహనం, ఫాన్ బ్రోకర్లకు నగలు అమ్మిన రశీదులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇతను ఇప్పటి వరకూ 150 చోరీలు చేసినప్పటికీ.. చేసినవి చిన్న చిన్న ఆభరణాలు కావడంతో కేవలం 28 ఫిర్యాదు మాత్రమే పోలీసులకు అందాయని డీసీపీ తెలిపారు. ఫిర్యాదు అందని కేసులకు సంబంధించిన సొత్తును కోర్టుకు అప్పగిస్తామని ఆయన అన్నారు. రవికిరణ్ నాలుగేళ్లగా చోరీలకు పాల్పడుతున్నా... పోలీసులకు పట్టుబడటం మాత్రం ఇదే తొలిసారి. కొనుగోలు చేసిన వారిని సైతం... రవికిరణ్ నుంచి దొంగ బంగారం కొనుగోలు చేసిన నాలుగురు పాన్ బ్రోకర్లను సైతం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో చిక్కడపల్లికి చెందిన వినోద్‌కుమార్(52), తిలక్‌నగర్‌కు చెందిన సంతోష్‌జైన్(33), కాచిగూడకు చెందిన జెయేష్ గాంధీ(38), నారాయణ గూడకు చెందిన గౌతమ్ చంద్ జైన్ ఉన్నారు. సమావేశంలో కాచిగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అడిషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, నల్లకుంట డిటెక్టిటివ్ ఇన్స్పెక్టర్ ఎస్. రాఘవేంద్రలు పాల్గొన్నారు. -
భర్త కోసం భార్య ఆందోళన
ఘటకేసర్: భర్త కోసం భార్య ఆందోళనకు దిగింది. భర్త కార్యాలయం ఎదుట ఆమె పిల్లలతో కలిసి బైఠాయించింది. వివరాలు.. మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం లక్ష్మీనగర్‌కు చెందిన మలిపెద్ది వీణధరి(28)ని గుంటూరు జిల్లా చెరకుపల్లి మండలం నడింపల్లికి చెందిన రవికిరణ్ 2008లో వివాహం చేసుకున్నాడు. కట్నకానుకలతో వీణధరి తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి చేశారు. దంపతులు నగరంలోని కూకట్పల్లి నిజాంపేట్‌లోని కాపురం ఉంటున్నారు. వీరికి పిల్లలు శరణ్య, ఉదయకృష్ణ ఉన్నారు. రవికిరణ్ ఘట్కేసర్ మండలం పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలని అతడు భార్యను వేధించడంతో వీణధరి తల్లిదండ్రులు కొంతడబ్బు ఇచ్చారు. నాలుగు నెలలుగా రవికిరణ్ ఇంటికి రాకపోవడంతో వీణధరి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. తన భర్త గురించి అత్తామామలతో పాటు ఆడపడుచులను అడిగినా ఫలితం లేకుండా పోయిందని వీణధరి తెలిపింది. దీంతో ఆమె సోమవారం భర్త రవికిరణ్ పనిచేసే పోచారం ఇన్ఫోసిస్ కార్యాలయం ఎదుట పిల్లలతో కలిసి బైఠాయించి ఆందోళనకు దిగింది.కంపెనీ యాజమాన్యం సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వీణధరితో మాట్లాడారు. కుటుంబ సమస్యలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వీణధరిని సముదాయించడంతో ఆమె శాంతించి పిల్లలను తీసుకొని వెళ్లిపోయింది. -
విధి విడదీసింది...
రెండు కుటుంబాల్లో ముగ్గురు దుర్మరణం ఒక కుటుంబంలో తల్లి, కొడుకు... మరో కుటుంబంలో చిన్నారి మృతి బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రిలో విషాదఛాయలు వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఒకరిది జగ్గయ్యపేట, మరొకరిది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. వేసవి సెలవుల్లో రెండు కుటుంబాలు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాయి. కానీ... తిరుగు ప్రయాణంలో విధి వారిద్దరినీ విడదీసింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి కుటుంబాల్లోని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ప్రత్తిపాడు (గుంటూరు), న్యూస్‌లైన్ : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద కాటూరి వైద్య కళాశాల సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ప్రాణ స్నేహితులైన జగ్గయ్యపేటకు చెందిన కుందేలు రవికిరణ్, సత్తుపల్లికి చెందిన దూదిపాళ్ల ప్రభు వేసవి సెలవుల్లో సకుటుంబసమేతంగా తిరుపతి, కంచి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు. ఈనెల 23వ తేదీ శుక్రవారం కుందేలు రవికిరణ్ తన కుటుంబసభ్యులైన తల్లి రాజ్యం, భార్య శ్రీదేవి, కుమార్తె గాయత్రి, కుమారుడు హవీష్, ప్రాణ స్నేహితుడు దూదిపాళ్ల ప్రభు, అతని భార్య శ్రీదేవి, కుమార్తెలు యోజిత, చేతనలతో కలిసి మొత్తం రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిదిమంది కారులో తిరుపతి బయలుదేరి వెళ్లారు. పుణ్యక్షేత్రాలను సందర్శించి బుధవారం సాయంత్రం జగ్గయ్యపేటకు బయలుదేరారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వేగంగా వస్తున్న కారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై కాటూరి మెడికల్ కళాశాలకు సమీపంలో నిర్మించిన వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవికిరణ్ (38)తో పాటు అతని తల్లి రాజ్యం (63), స్నేహితుడు ప్రభు కుమార్తె యోజిత (8) మృత్యువాత పడ్డారు. మిగిలిన ఆరుగురు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. ఒక కుటుంబం తల్లీ కొడుకును కోల్పోగా, మరో కుటుంబం కన్నకూతురిని కోల్పోయింది. రవి ఎలా ఉన్నాడు... తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దూదిపాళ్ల ప్రభు భరించలేని గాయాల దెబ్బలను సైతం పంటిబిగువున భరిస్తూ, తన స్నేహితుడి యోగక్షేమాలను ఆరా తీయడం అందరినీ కలిచివేసింది. స్ట్రెచర్‌పై చికిత్స పొందుతూనే తనకు వైద్యం చేస్తున్న వైద్యులు, నర్సులతో రవి ఎలా ఉన్నాడు.. వాడికేం ఇబ్బందిలేదుగా.. అంటూ అడిగాడు. తీవ్ర గాయాలతో బాధపడుతూ కూడా తన స్నేహితుడి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం చూసిన వారు వారి స్నేహ బంధాన్ని తలచుకుని కంటతడి పెట్టుకున్నారు. అమ్మా.. ఒక్కసారి లేమ్మా.. కుందేలు రవికిరణ్, అతని తల్లి రాజ్యం మృతిచెందారన్న విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు, బంధువులు ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడులోని కాటూరి వైద్యశాల వద్దకు చేరుకున్నారు. రవికిరణ్ చెల్లెలు విగతజీవులుగా పడి ఉన్న మృతదేహాలపై పడి అమ్మా లేవే.. ఒక్కసారి నాతో మాట్లాడవే.. అన్నా లే అన్నా.. ఒక్కసారి లే అన్నా.. అంటూ పెద్దపెద్దగా ఏడవడంతో ఆస్పత్రి ప్రాంగణం అంతా బంధువుల రోదనలతో మార్మోగింది. నొప్పులతో ఎగిరెగిరి పడుతూ.. ప్రమాదం బారిన పడిన వారిలో నలుగురు చిన్నారులు ఉండడంతో వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తలకు, కాళ్లకు, చెవులకు, చేతులతో పాటు పలు శరీర భాగాల వద్ద తీవ్ర గాయాలవడంతో నొప్పులు భరించలేక ఆ చిన్నారులు అల్లాడిపోయారు. వైద్య సిబ్బంది వైద్యం చేయడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ చిన్నారులు నొప్పులతో ఎగిరెగిరిపడుతూ ఎక్కిళ్లు పెట్టి ఏడవడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. చిన్నారులకు ఎంత కష్టం వచ్చింది దేవుడా..అంటూ విలపించారు. -
నా కెరీర్ మలుపు తిరుగుతుంది!
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ 2013-14 సీజన్లో లీగ్ దశ పోటీలు ముగిసే సరికి హైదరాబాద్ క్రికెటర్ గాదె హనుమ విహారి తనదైన ముద్ర వేశాడు. 8 మ్యాచ్‌ల్లో 841 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఎప్పుడో 14 ఏళ్ల క్రితం వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత ఒక హైదరాబాదీ ఈ తరహాలో నిలకడగా భారీగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. అంతే కాదు... సీజన్లో కనీసం 500 పరుగులు చేసిన 39 మంది ఆటగాళ్లలో అత్యధిక సగటు (93.44) కూడా విహారిదే కావడం విశేషం. తాజా ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించడంతో విహారిలో ఆత్మ విశ్వాసం పెరిగింది. లక్ష్మణ్ తర్వాత హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌గా భారత జట్టులో చోటు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్న విహారి తన ఆట గురించి ‘సాక్షి’తో మాట్లాడాడు. విశేషాలు అతని మాటల్లోనే... రంజీ ట్రోఫీలో పరుగులు చాలా సంతోషంగా ఉంది. రంజీల్లో నాకిది నాలుగో సీజన్. ప్రతీ ఏడాది నా ఆట మరింత మెరుగవుతూ వచ్చింది. అదే క్రమంలో ఈసారి భారీగా పరుగులు సాధించాను. 3 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు...అందులో గత ఏడాది కొద్దిలో మిస్సయిన డబుల్ సెంచరీ ఈ సారి దక్కింది. రంజీ మ్యాచ్‌ల ఆరంభానికి ముందు తీవ్రంగా శ్రమించాను. అది ఫలితాన్నిచ్చింది. ఈ ప్రదర్శన నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావిస్తున్నా. నిలకడైన ప్రదర్శన... గ్రూప్ ‘సి’లో చిన్న జట్లతో ఆడటం వల్ల నా పరుగుల విలువ తగ్గుతుందని నేను భావించడం లేదు. టీమ్ గేమ్‌లో నా ఒక్కడి ప్రదర్శన ఫలితాన్ని మార్చలేదు కాబట్టి నేను ఏ జట్టులో ఉన్నానో ఆ జట్టు తరఫున అసాధారణంగా ఆడటం ముఖ్యం. ఇంకా చెప్పాలంటే మా టీమ్‌లో ఎప్పుడైనా బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలవాలనే నేను కోరుకుంటా. నేను నిలకడగా ఆడలేనని చాలా మంది నన్ను విమర్శించాను. అయితే అలా ఆడగల సత్తా నాలో ఉందని ఈ స్కోర్లతో నిరూపించాను. ఆటతీరులో మార్పులు ఈ ఏడాది శుభారంభమే చేసినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాను. సీజన్ రెండో దశలో అలాంటి తప్పులు చేయరాదని నిర్ణయించుకున్నా. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవద్దని పట్టుదలగా నిలిచాను. ఫలితంగా వరుసగా మూడు సెంచరీలు వచ్చాయి. ముఖ్యంగా గోవాతో మ్యాచ్‌లో దూకుడుగా ఆడి డబుల్‌ను చేరుకున్నా. ఎప్పుడైనా బ్యాటింగ్‌లో బేసిక్స్ నా బలమని నమ్ముతా. రాబోయే దేశవాళీ వన్డే, టి20ల్లో కూడా బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నా. రంజీ జట్టు వైఫల్యం ఈసారి హైదరాబాద్ మరీ ఘోరంగా ఏమీ ఆడలేదు. మేం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు కూడా. ఎక్కువ మంది యువకులు ఉన్నారు. ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అయితే బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు చేసినా బౌలింగ్ లోపంతో ఎక్కువ మ్యాచుల్లో గెలవలేకపోయాం. రవికిరణ్‌కు మరో బౌలర్ మద్దతు లభిస్తే బాగుండేది. వచ్చేసారి దీనిని మెరుగుపర్చుకుంటే మా జట్టు ముందుకు వెళుతుంది. భారత జట్టులో అవకాశాలపై నా పరిధిలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే నా పని. సెలక్టర్ల ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పలేను కానీ ఇదే జోరును మరో రెండు సీజన్ల పాటు కొనసాగిస్తే ఖచ్చితంగా వారిని ఆకట్టుకోగలననే నమ్ముతున్నా. అండర్-19 ఆడినా, రంజీ ఆడినా ఏ క్రికెటర్‌కైనా అంతిమ లక్ష్యం భారత జట్టు ప్రాతినిధ్యం వహించడమే కదా. ఐపీఎల్ వేలం గత ఐపీఎల్లో అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం నిజంగా నేను ఏ మాత్రం ఊహించనిది. బహుశా నేను మానసికంగా సిద్ధంగా లేకపోవడం వల్లనేమో ఐపీఎల్లో ఎక్కువ మ్యాచుల్లో అంచనాలు అందుకోలేకపోయాను. ఈ సారి అలా కాదు. నేను ఇప్పుడు నిలదొక్కుకున్నా. భారీగా పరుగులు చేయడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. వేలంలో ఏ జట్టుకు ఎంపికైనా సంతోషమే. ఫిక్సింగ్ వార్తలు రావడం అవన్నీ అర్ధం లేనివి. మా ప్రమేయం, నియంత్రణలో లేకుండా ఇలాంటి వార్త రావడం దురదృష్టకరం. నేను ఎదిగే సమయంలో వెనక్కి లాగేందుకు ఎవరో పనిగట్టుకొని రాసినట్లుంది. అయినా ఈ చిన్న విషయాలు నా స్థైర్యాన్ని, ఆటను దెబ్బ తీయలేవు. వాటి తర్వాత నేను ఎంత మంచి క్రికెట్ ఆడానో చూశారు కదా! అండర్-19 జట్టు ప్రదర్శన భారత జట్టుకు నా అభినందనలు. అందరికంటే మన జట్టు చాలా పటిష్టంగా ఉంది. మనవాళ్లు వరుసగా టోర్నీలు గెలుస్తున్నారు. నా సహచరుడు మిలింద్ బాగా ఆడుతున్నాడు. 2012లో ప్రపంచకప్ నెగ్గిన జట్టులో మాతో ఉన్న విజయ్ జోల్ ఇప్పుడు టీమ్‌ను నడిపిస్తున్నాడు. అతను మళ్లీ వరల్డ్ కప్ అందిస్తాడనే నమ్ముతున్నా.