
‘‘నాది తూర్పుగోదావరి జిల్లా భద్రవరం. నేను ఎవరి దగ్గరా దర్శకత్వశాఖలో చేయలేదు. ఇంటర్నెట్ నుంచి సమాచారం సేకరిస్తూ, షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ సినిమాని తెరకెక్కించడం ఎలాగో నేర్చుకున్నా’’ అని డైరెక్టర్ రవికిరణ్ అన్నారు. కిరణ్ అబ్బవరమ్, రహస్యగోరక్ హీరోహీరోయిన్లుగా డి. మనోవికాస్ నిర్మించిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా నవంబర్ 29న విడుదలైంది.
ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రవికిరణ్ మాట్లాడుతూ– ‘‘ఊరి నుంచి హైదరాబాద్ వచ్చాక సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. కథ కంటే కథనం బాగుండాలి. చిన్న అంశాల చుట్టూ సన్నివేశాలు అల్లుకుని ప్రేక్షకులను మెప్పించడం నాకు ఇష్టం. నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి అక్కడి అనుబంధాలు, రాజకీయాలు, వెటకారాలు తెలుసు. అందుకే ఈ నేపథ్యంలో కథ అల్లుకున్నా. మా సినిమా చూసినవారిలో కొందరు ‘తొలిప్రేమ’ చిత్రంలా ఉందనడం ఆనందంగా ఉంది. నా తర్వాతి చిత్రం కోసం రాజకీయ నేపథ్యంలో ఓ కథ సిద్ధం చేసుకుంటున్నా’’ అన్నారు.