చేతిలో బాండ్లు.. చెవిలో పువ్వు!
* చంద్రబాబూ.. ఇంకెంత కాలం రైతుల్ని మోసం చేస్తారు?
* వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజం
* రాష్ట్ర ప్రభుత్వ దగాకోరు విధానాలకు నిరసనగా 16న ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు
సాక్షి, హైదరాబాద్: రైతుల అప్పుల కావడిని మో సే భారం తనదేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి భరోసా ఇస్తున్నట్లు ప్రకటించి రైతులను ఇంకా మోసం చేస్తున్నారని, రైతుల చేతిలో బాండ్లు, వారి చెవిలో పువ్వులు పెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన మం గళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రుణాల మాఫీకి చంద్రబాబు ఏదో శ్రమపడుతున్నట్లు ఆయన అనుకూల పత్రికలు, మీడియా చిత్రీకరించడానికే ఇది ఉపయోగపడుతోందే తప్ప రైతులకు మేలు జరగడం లేదన్నారు. కొలంబస్ అమెరికాను కనుగొన్నట్లుగా తాను రైతు రుణమాఫీకి మార్గాన్ని కనుగొన్నానని చంద్రబాబు ప్రకటించడాన్ని అంబటి ప్రస్తావిస్తూ ‘అంటే ఇంతకు ముందు చంద్రబాబుకు రుణాల మాఫీకి మార్గాలు తెలియవా?’ అని ప్రశ్నించారు.
నాడు అన్నీ తెలుసన్నారు..
‘‘ఎన్నికలకు ముందు రెతుల మొత్తం వ్యవసా య రుణాలు మాఫీ చేస్తానని బాబు ప్రకటించా రు. మరి ఆ నాటికి ఆయనకు రుణ మాఫీ ఎలా చేయాలో మార్గం తెలియదా? రూ.1.27 లక్షల కోట్లున్న రుణాలను ఎలా మాఫీ చేస్తారో చెప్పాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు ప్రశ్నిస్తే ‘మీకు అనుభవం లేదు, నేను ఎంఏ ఆర్థిక శాస్త్రం చదివాను. ఎలా మాఫీ చేయాలో తెలుసు’ అని చంద్రబాబు అన్నార’’ని అంబటి గుర్తుచేశారు.
మాఫీ అన్నారు.. కమిటీ వేశారు..
తాను అధికారంలోకి రాగానే తొలి సంతకంతో మాఫీ అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారని అంబటి అన్నారు. తీరా అధికారం చేపట్టాక తొలి సంతకం చేసింది మాఫీకి కాదని, కోటయ్య కమిటీ నియామకానికి మాత్రమేనన్నారు. రైతు సాధికార కమిషన్ వనరులను సమీకరించి 20 శాతం రుణాలను చెల్లిస్తుందని, 80 శాతం రుణాలకుగాను రైతుల చేతిలో బాండ్లను పెడుతుం దని చెప్పడం చూస్తే మాఫీ పట్ల చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనేది స్పష్టం అవుతోందన్నారు. బాండ్లతో రుణాలు మాఫీ అయినట్లేనని మాట రిజర్వుబ్యాంకు గవర్నర్ చేత చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
16న వైఎస్సార్ సీపీ నిరసనలు
రాష్ట్ర ప్రభుత్వ దగాకోరు విధానాలకు నిరసనగా ఏపీలోని ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ఈ నెల 16న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయబోతున్నట్లు అంబటి వెల్లడించారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీ ల నుంచి తప్పుకోవడాన్ని నిరసిస్తూ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తమ పార్టీ ప్రజల్లో ఉండి పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.