ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్ష ఈనెల 8న నిర్వహించనున్నట్టు సీఆర్ రెడ్డి కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ ఎన్‌వీవీఎస్ ప్రసాద్, యూనివర్సిటీ సమన్వయాధికారి జి.రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరుగుతుందన్నారు. పరీక్ష ఫీజులు చెల్లించిన అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్‌ఏఓయూ.ఏసీ.ఐఎన్ వెబ్‌సైట్ ద్వారా పొందాలని సూచించారు. భీమవరం, తణుకు, నల్లజర్ల సెంటర్ల విద్యార్థులకూ ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలోనే పరీక్షలు జరుగుతాయని తెలిపారు.