సాక్షి, అనంతపురం జిల్లా: రైతులందరికీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. విత్తన సంస్థలకు గత ప్రభుత్వం రూ. 150 కోట్ల బకాయిలు ఉన్నందునే అనంతపురం జిల్లాలో విత్తనాల సేకరణ ఆలస్యం అయిందన్నారు.
మొత్తం మూడు లక్షల క్వింటాళ్ల కు గాను ఇప్పటిదాకా రెండు లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు పంపిణీ చేశామని వివరించారు. రైతుల డిమాండ్ మేరకు మరో నలభై వేల క్వింటాళ్ల విత్తనాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఎంత ధర అయినా చెల్లించి వేరుశనగ విత్తనాలు సేకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని.. పొరుగు రాష్ట్రాల నుంచి విత్తనాలు తెప్పిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment