బోధన్, న్యూస్‌లైన్ : బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్‌ఎల్) ఎదు ట ఆంధ్రా అధికారిని వెనక్కు పంపాలని టీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఫ్యాక్టరీ ప్రధాన గేట్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఫ్యాక్టరీ ఏజీఎంగా ఆంధ్రప్రాంతానికి చెందిన పట్టాబీ నియామకమై విధుల్లోకి చేరుతున్నాడనే సమాచారం మేరకు టీఆర్‌ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ఆయనను అడ్డుకునేందుకు ఫ్యాక్టరీ గేట్ వద్ద మధ్యాహ్న 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు కాపు కాశా రు. అధికారి రాకపోవడంతో ఆందోళన విరమించి వెళ్లారు.
ఈ సందర్భం గా టీఆర్‌ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ రజాక్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగుతున్న ఎన్డీఎస్‌ఎల్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని నియమించడం సరైంది కాదన్నారు. రాష్ర్ట విభజన ప్రకటన నేపథ్యంలో తెలంగాణలోని ఫ్యాక్టరీలో ఆంధ్రప్రాంత అధికారిని తీసుకురావడంలో యాజమాన్యం దురుద్దేశం ఉందన్నారు. ఈ ఆందోళన లో టీఆర్‌ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు భరత్ యాదవ్, నా యకులు రవీందర్, శంకర్,వినోద్,నందాకుమార్, నరేష్, జితేందర్,మనోహర్,క్రిష్ణ, ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రా అధికారి గోబ్యాక్
Published Tue, Aug 20 2013 7:10 AM | Last Updated on Sat, Jun 2 2018 7:11 PM
Advertisement
Advertisement