
చైనా మంత్రులతో బాబు భేటీ
బీజింగ్: చైనాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నాలుగోరాజుకు చేరింది. చైనా మంత్రులు, కమ్యూనిస్ట్ పార్టీ నేతలతో బుధవారం చంద్రబాబు బృందం భేటీ అయ్యింది.
ఇప్పటికే చంద్రబాబు బృందం మంగళవారం చైనా రాజధాని బీజింగ్‌లో 11 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వ వ్యాపార విభాగంలో 6, బిజినెస్ టు బిజినెస్ విభాగంలో 5 ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే.