
మత్తయ్యను అదుపులోకి తీసుకున్న సీఐడీ
విజయవాడ: ఓటుకు నోటు కేసులో A-4 నిందితుడిగా ఉన్న మత్తయ్యను ఆంధ్రప్రదేశ్ సీబీసీఐడీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ మత్తయ్య చేసిన ఫిర్యాదుపై సీఐడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అతడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు ఇవాళ స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దాంతో మత్తయ్య వాంగ్యూలాన్ని మేజిస్ట్రేట్ రికార్డు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాలూకు మనుషులు తనను బెదిరిస్తున్నారంటూ మత్తయ్య కొద్దిరోజుల క్రితం విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.