పొట్టి శ్రీరాములు నెల్లూరు టౌన్: టెర్రరిజంతో అధికారం చెలాయించాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద టెర్రరిస్టని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మంగళవారం పద్మావతి మహిళా గ్రంథాలయం ఆవరణంలో ఓపీడీఆర్, పౌరహక్కుల సంఘం సంయుక్తంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పథకం ప్రకారమే చంద్రబాబు ప్రభుత్వం తమిళ కూలీలను పట్టుకుని హతమార్చిందని ఆరోపించారు. అయితే ఒక పత్రిక మాత్రం తమిళ కూలీల హత్యాకాండను ఎన్‌కౌంటర్‌గా పేర్కొంటూ ప్రభుత్వానికి వంతపాడుతోందని విమర్శించారు.