sheshachalam encounter
-
'శేషాచలం' సాక్షులను విచారిస్తున్న సిట్
-
'శేషాచలం' సాక్షులను విచారిస్తున్న సిట్
తిరుపతి: శేషాచలం ఎన్కౌంటర్ కేసులో సాక్షులను సిట్ విచారిస్తోంది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో సిట్ బృందం విచారణ చేస్తోంది. సోమవారం అర్ధరాత్రి తమిళనాడులోని తిరువన్నామలై నుంచి సాక్షులను తీసుకువచ్చారు. అయితే తమవారి ప్రాణాలకు ముప్పు ఉందని సాక్షుల బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పథకం ప్రకారం తమవారిని కాల్చి చంపారని సాక్షులు ఇంతకుముందు హైకోర్టులో సాక్షం చెప్పారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఎర్రచందనం కూలీలు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. -
అర్దరాత్రి సాక్షులను తీసుకొచ్చిన పోలీసులు
-
కూలీల కాల్చివేతపై సీబీఐ దర్యాప్తు
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం రూ. 5 లక్షల చొప్పున తక్షణ మధ్యంతర పరిహారం చెల్లించాలి సమాచారం ఇవ్వడంలో ఏపీ విముఖత ప్రదర్శిస్తోంది వచ్చే నెల 9న ఏపీ సీఎస్, డీజీపీ హాజరుకావాలి న్యూఢిల్లీ: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ఎన్హెచ్ఆర్సీ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 7, 2015న తమిళనాడుకు చెందిన ఆరోపిత ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన సంఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సూమోటోగా కేసు నమోదు చేసింది. బాధితుల పూర్వాపరాలను, ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదైన తీరును, సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రకటనలను, సంఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాల స్వభావం పరిశీలించిన మీదట, ప్రత్యక్ష సాక్షులు శేఖర్, ఎ.బాలచంద్రన్, ఎం.ఇలాంగో వాంగ్మూలాలు విన్న తరువాత, రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనపై ప్రాథమిక సమాచారం పంచుకోవడానికి ఇష్టపడటం లేదని గ్రహించిన తరువాత కొన్ని విషయాలను ఈ కమిషన్ గ్రహించింది. 1. శేషాచలం అడవుల్లో పోలీసులు 20 మందిని చంపివేయడం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. 2. బాధితులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. 3. ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు గానీ, ఇతర నిష్పాక్షిక దర్యాప్తు సంస్థ అంతిమ నివేదిక వచ్చేంతవరకు ఆయా కుటుంబాలు ఆకలితో చనిపోయే పరిస్థితి రానివ్వరాదు. ఈ నేపథ్యంలో కమిషన్ మొత్తం ఆరు ఆదేశాలు, సిఫారసులు చేసింది. ఇవీ ఆదేశాలు, సిఫారసులు 1. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున తక్షణ మధ్యంతర సాయంగా ఏపీ ప్రభుత్వం అందజేయాలి. పరిహారం చెల్లించినట్టుగా ఆధారాలతో ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలి. 2. చనిపోయినవారిలో 13 మంది గిరిజనుల కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని 12(4)వ నిబంధన కింద ఆర్థిక సాయం సక్రమంగా అందేలా చిత్తూరు జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుని ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించాలి. 3. భారత, ఏపీ ప్రభుత్వాలు ఈ సంఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి. ఇందుకు అవసరమైన లాంఛనాలు పూర్తిచేసి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలి. 4. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను తమిళనాడులోని అధీకృత మెజిస్ట్రేట్ వద్ద నమోదు చేయించాలి. 5. ప్రత్యక్ష సాక్షులు శేఖర్, ఎ.బాలచంద్రన్, ఎం.ఇలాంగో, వారి కుటుంబ సభ్యులు, పంచాయతీ అధ్యక్షులకు వారు నివసిస్తున్న ప్రాంతంలో తగిన రక్షణను కొనసాగించేలా తమిళనాడు డీజీపీ చర్యలు తీసుకోవాలి. 6. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ జూన్ 9న ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు స్వయంగా హాజరుకావాలి. కమిషన్ అడిగిన సమాచారంతో హాజరుకావాలి. సీఎస్‌తో డీజీపీ చర్చలు సాక్షి, హైదరాబాద్: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఎన్హెచ్ఆర్సీ సీబీఐ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసిన నేపథ్యంలో డీజీపీ జేవీ రాముడు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో సమావేశమయ్యారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎన్హెచ్ఆర్సీ సూచించడం పోలీసు అధికారుల్లో కలకలం రేపింది. శుక్రవారం ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు వెలువడగానే డీజీపీ జేవీ రాముడు హడావుడిగా సచివాలయం చేరుకుని ఐవైఆర్ కృష్ణారావుతో చర్చలు జరిపారు. అనుసరించాల్సిన విధానంపై సుదీర్ఘంగా చర్చించారు. -
గుట్టంతా కాల్ డేటాలోనే దాగుంది
-
గుట్టంతా కాల్డేటాలోనే దాగుంది
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ పూర్తిగా బూటకమని మధురై కేంద్రంగా పనిచేస్తోన్న పీపుల్స్ వాచ్ సంస్థ డైరెక్టర్ హెన్రీ టిపాగ్నే అన్నారు. ఏపీలోకి ప్రవేశించిన తరువాత కూలీలను సజీవంగా పట్టుకున్న పోలీసులు.. డీఐజీ కార్యాలయం నుంచి అడవిలోకి తీసుకెళ్లి వారిని కాల్చిచంపారని మంగళవారం మానవహక్కుల వేదిక ఎదుట వాదనలు వినిపించారు. కూలీల మొబైల్ ఫోన్లు లాక్కున్న పోలీసులు.. వాటినుంచే కూలీల కుటుంబ సభ్యులకు కాల్స్ చేసి బెదిరించారని, కాల్ డేటా బయటికివస్తే నిజానిజాలు వెల్లడవుతాయన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన రోజు తెల్లవారుజామున 2:30 గంటలకు కూలీల ఫోన్లన్నీ స్విచ్చాఫ్ అయ్యాయని, సాక్షుల వాగ్మూలాన్ని బట్టిచూస్తే తమ వాదన నూటికి నూరుపాళ్లూ నిజమేనని హెన్రీ అన్నారు. పోలీసులు చేసిన కాల్స్ రికార్డయ్యాయని, వాటిని బయటపెట్టాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఎన్ హెచ్చార్సీ ఇప్పటికే ఆదేశించిందన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం అన్నివిషయాలను దాటవేస్తోందని ఆరోపించారు. తమ దగ్గర ఉన్న పూర్తి వివరాలతో ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తామని, తగిన ఉత్తర్వులు వస్తాయని ఆశిస్తున్నామని హెన్రీ పేర్కొన్నారు. -
పోలీసుల FIRలో అన్నీ అవాస్తవాలే.?
-
'ఎన్కౌంటర్ పై ఇప్పుడే నివేదిక ఇవ్వలేం'
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం కూలీలు ఎన్ కౌంటర్ అయిన ప్రాంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం మంగళవారం పరిశీలించింది. ఎన్కౌంటర్ పై ఇప్పుడే నివేదిక ఇవ్వలేమని ఎన్హెచ్ఆర్సీ బృందం తెలిపింది. ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు దత్తు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో పరిశీలించింది. అన్ని విభాగాల అధికారులను విచారణ చేస్తున్నామని, సమగ్ర నివేదికను కమిషన్‌కు సమర్పిస్తామని దత్తు తెలిపారు. నాలుగు రోజుల పాటు తిరుపతిలోనే ఉంటామని, ఉన్నతాధికారుల నుంచి అన్ని నివేదికలు తెప్పించుకుంటామని చెప్పారు. సచ్చినోడిబండ, చిగటీగలకోన ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించింది. ఏప్రిల్ ఏడో తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. -
శేషాచలం ఎన్ కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎన్హెచ్ఆర్సీ
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శేషాచల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం పరిశీలిస్తోంది. ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు దత్తు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం మంగళవారం ఉదయం పరిశీలన చేపట్టింది. సచ్చినోడిబండ, చిగటీగలకోన ప్రాంతాల్లో ఈ బృందం పరిశీలన చేయనున్నట్టు సమాచారం. గత నెల ఏడో తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. -
లోకేశ్, కేటీఆర్ హైక్లాస్ బెగ్గర్స్..
తిరుపతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తనయుల విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు కె.నారాయణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. లోకేశ్, కేటీఆర్ హైక్లాస్ బెగ్గర్స్‌గా మారారని ఆయన ఎద్దేవా చేశారు. కాగా లోకేశ్, కేటీఆర్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. సీపీఐ నారాయణ మంగళవారం తిరుపతిలో విలేకర్లతో మాట్లాడుతూ రైతులకు ఇష్టం లేకుండా భూములు లాక్కుని రాజధాని నిర్మిస్తే అది శ్మశానంపై నిర్మించినట్లే అవుతుందన్నారు. అనంతపురంలో హత్యలకు ప్రభుత్వ కార్యాలయాలు అడ్డగా మారాయని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డిని ప్రభుత్వ కార్యాలయంలోనే హతమార్చడం దారుణమన్నారు. శేషాచలం అడవుల్లో చనిపోయినవారంతా కూలీలే అని, వారు స్మగ్లర్లు అని చంద్రబాబు నిరూపించగలరా అని నారాయణ సూటిగా ప్రశ్నించారు. వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి చనిపోయినవారు స్మగ్లర్లని చంద్రబాబు చెప్పగలరా అంటూ ప్రశ్నలు సంధించారు. -
సిట్‌ను తన ఆధీనంలోకి తీసుకున్న హైకోర్టు
-
సిట్‌ను తన ఆధీనంలోకి తీసుకున్న హైకోర్టు
హైదరాబాద్ : తిరుపతి శేషాచలం ఎన్కౌంటర్ ఘటనపై హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం నియమించిన సిట్‌ను న్యాయస్థానం తన ఆధీనంలోకి తీసుకుంది. 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు ఈ సందర్భంగా సిట్‌ను ఆదేశించింది. సిట్ సభ్యులపై అభ్యంతరాలు ఉంటే ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. శేషాచలం ఎన్కౌంటర్ కేసు డైరీని న్యాయస్థానం స్వాధీనం చేసుకుంది. అలాగే పోలీసులు దాఖలు చేసిన కేసు డైరీపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా ఏప్రిల్ 9న చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఐజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్‌ను ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన విషయం విదితమే.ప ఇందులో 8 మంది పోలీసు అధికారులు ఉన్నారు. సిట్ సభ్యులుగా కర్నూలు రేంజి డీఐజీ రమణకుమార్, ఎస్పీ పాలరాజు, పశ్చిమగోదావరి జిల్లా ఏఎస్పీ చంద్రశేఖర్, సీఐడీ డీఎస్పీ యుగంధర్ బాబు, కే రఘు, కోరుకొండ సీఐ మధుసూదన్, చిత్తూరు సీఐ చంద్రశేఖర్ ఉన్నారు. -
రక్షకులే రాజ్యాంగేతర శక్తులైతే ఎలా?
దివికుమార్ ‘చంద్రు’లు ఇద్దరూ తమ పనితనం మీద విదేశీ బహుళజాతి పెద్దలు పెట్టుకున్న అనుమానాలనూ, శంకలనూ ఒక్క ఎన్కౌంటర్ దెబ్బతో తొలగించినట్టయింది. నిరసనలూ, ఆందోళనలపై ఎలాంటి సంకోచం పెట్టుకోవద్దని, శాంతి భద్రతల విషయంలో తమ సాయుధ సామర్థ్యాన్ని ఈ ఎన్కౌంటర్ల ద్వారా నిరూపించుకున్నారు. మన రెండు కొత్త తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏప్రిల్ ఏడున వినిపించినవి పాత ఎన్కౌంటర్ కథలే. శేషాచలం అడవులలో 20 మంది తమిళ కూలీలూ, వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే దారిలో వికారుద్దీన్‌తో పాటు నలుగు రు ముస్లింలూ ఎన్కౌంటర్లలో చనిపోవడానికి సంబంధించిన కహానీలు అవి. ఎర్రచందనం స్మగ్లర్లు (దాదాపు రెండు వందల మంది) అటవీ సంరక్షణా బృందానికి ఎదురుపడ్డారు. అదుపులోనికి తీసుకోవడానికి సిబ్బంది యత్నిస్తే, కూలీలు రాళ్లు, గొడ్డళ్లతో దాడిచేశారు. ఆత్మరక్షణ కోసం సిబ్బంది కాల్పులు జరపగా 20 మంది కూలీలు చనిపో యారు. మిగిలినవారు దొరకలేదు. ఇదీ శేషాచలం ఎన్ కౌంటర్ కథనం. వికారుద్దీన్ అనే ‘మహా ఉగ్రవాది’ని వరంగల్ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా, సంకెళ్లతో ఉన్నప్పటికీ పోలీసుల తుపాకులు లాక్కుని దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఇది తెలం గాణ పోలీసుల కథ. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధిపతి జస్టిస్ మార్కండేయ కట్జూ చెప్పిన మాట ఇక్కడ గుర్తుచేసుకో వాలి. ఎలాంటి ఎదురుకాల్పుల హత్య కేసులో అయినా ముందుగా చంపినవారి మీద హత్యానేరం (సెక్షన్ 302) నమోదు చేయవలసిందేనని కట్జూ అన్నారు. కాల్పులు ఆత్మరక్షణ కోసమే జరిగాయన్న సంగతి రుజువైనాక వారిని నిర్దోషులుగానూ, విధులను సక్రమంగా నిర్వ హించినవారిగా గుర్తించాలన్నారాయన. పోలీస్, రక్షణ సిబ్బంది ఆత్మరక్షణ కోసమే ఈ ఎన్కౌంటర్లు, అంటే హత్యలు చేయవలసి వచ్చిందని నమ్మేస్థితిలో ప్రజలే కాదు, ప్రైవేటుగా మాట్లాడితే ఏ అధికారీ, రాజకీయ నేత లేరు. ఎన్కౌంటర్లను రాజ్యాంగం కూడా ఒప్పు కోదు. కాబట్టే ప్రభుత్వాలే ఒక వంక చట్టబద్ధ సమర్థన చేస్తూనే, మరోవంక చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతూ అందుకు నైతిక మద్దతును కూడగట్టుకునేందుకు యత్ని స్తున్నాయి. శేషాచలం విషయంలో ఇది మరీ ఎక్కువ. వికారుద్దీన్ తదితరులు ‘ఉగ్రవాదులు’ కనుక, అప్పటికి కొద్దికాలం ముందు సూర్యాపేట ప్రాంతాలలో గస్తీ పోలీసుల మీద ఎవరో ఉగ్రవాదులు దాడి చేసి ఒక పోలీసునూ, తరువాత ఒక ఎస్ఐ (సిద్ధయ్య)నూ బలి తీసుకున్నందుకు ప్రతీకారంగానే పోలీసు శాఖ ఈ హత్య లకు పాల్పడింది. కాగా, అటవీ సిబ్బంది, పోలీసుల మీద దాడులు జరిగినపుడు ఎవరూ ఖండించరేమిటన్న చౌకబారు వాదనను కొందరు మేధావులు సహా, వెంక య్యనాయుడు వంటి నాయకుని దాకా చేస్తున్నారు. పోలీసులు అతిక్రమించినపుడు ప్రజాసంఘాలు ఆందో ళన చేయకపోతే బాధితులకు న్యాయం ఎలా జరుగు తుంది? బలహీనులనూ, రాజ్యం బాధితులనూ పట్టిం చుకోకుంటే, నిరసనలూ ఆందోళనలూ లేకుండా న్యా యం జరిగిపోతుందని మనకు హామీ ఉందా? అలాం టి సందర్భాలలో పోలీసులు న్యాయమూర్తులమన్న తీరులో వ్యవహరించడం వల్ల, శిక్షలు విధించడం వల్ల న్యాయ వ్యవస్థను కొరుక్కుతిన్నట్టే అవుతుంది. ఈ సున్నిత విభజన రేఖ సామాన్యులకు తెలియకపోవచ్చు. పాలక వర్గాలు, వాటి అనుకూల మీడియా తెలిసి కూడా న్యాయ వ్యవస్థను కబళిస్తున్న వారి గురించి ప్రజల దృష్టికి రాకుండా చేయడానికి యత్నిస్తున్నది. ఇప్పటి సంఘటనలలో ఇదే కీలకాంశం. ఎర్రచందనం ఎన్‌కౌం టర్ను కప్పిపుచ్చడానికీ, నిరసన లేకుండా చేయడానికీ అవకాశం తగ్గుతున్న కొద్దీ స్మగ్లింగ్ వార్తలను ముందుకు తెస్తున్నారు. కూలీలు కూడా స్మగ్లర్లేనన్న భావనను కల్పించి, ప్రజాధనాన్ని కాపాడడానికి, అలాంటి స్మగ్ల ర్లను చంపే హక్కు అటవీ సిబ్బందికి తప్పనిసరి అన్నట్టు కూడా వ్యూహకర్తలు ప్రచారంలో పెట్టారు. హంత కులకు, స్మగ్లర్లకు, ఉగ్రవాదులకు పౌర హక్కులేమిటని అంటున్నారు. కానీ ఈ స్మగ్లింగ్ వెనుక ఆంధ్ర, తమిళ నాడు అటవీ అధికారులు, పోలీసులు, మాఫియాలు, పాలక ముఠాల నాయకులు ఉన్నారని ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు. ఏవో పనుల మీద వెళుతున్న తమిళ కూలీలను ఈ నెల ఆరున బస్సుల నుంచి దింపి, హింసించి; మరు నాడు శేషాచలం అడవులలో 20 మందినీ కాల్చివే శారనడానికి ప్రత్యక్ష పరోక్ష సాక్ష్యాలు ఉన్నాయి. శవాలు ఉన్నచోట చెట్లు లేవు. శవాల పక్కన పడేసిన దుంగల మీద తెల్ల రంగుతో లాటు నంబర్లు ఉన్నాయి. కొన్ని శవాల కాళ్లూ చేతులూ, వాటి వేళ్లూ తెగిపోయి ఉన్నా యి. శేఖర్ అనే కూలీ ఆరోజున బస్సులో ఆడవారి మధ్యన కూర్చోవడం వల్ల అతడిని పట్టించుకోలేదు. మిగిలిన వారిని దింపేశారు. వారిలో కొందరే మరు నాడు శేషాచలం అడవులలో శవాలై తేలారు. కాగా, ‘చంద్రు’లు ఇద్దరూ తమ పనితనం మీద విదేశీ బహుళ జాతి పెద్దలు పెట్టుకున్న అనుమా నాలనూ, శంకలనూ ఒక్క ఎన్కౌంటర్ దెబ్బతో తొలగిం చినట్టయింది. నిరసనలూ, ఆందోళనలపై ఎలాంటి సం కోచం పెట్టుకోవద్దని, శాంతి భద్రతల విషయంలో తమ సాయుధ సామర్థ్యాన్ని ఈ ఎన్కౌంటర్ల ద్వారా నిరూపిం చుకున్నారు. పాట్నా హైకోర్టు నూరేళ్ల సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ‘ప్రజాప్రతినిధులు ప్రజాకర్షణకు ప్రయత్నిస్తారు. అలాంటి ప్రయత్నం పేరుతో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కట్టడి చేయవలసిన బాధ్యత న్యాయవ్యవస్థ మీద ఉంది’ అన్నారు. ఈ మాటలను తెలుగు ప్రభుత్వాలు అన్వ యించి చూసుకోవడం అవసరం. (వ్యాసకర్త జనసాహితి ప్రధాన కార్యదర్శి) మొబైల్: 94401 67891 -
'శేషాచలం ఎన్కౌంటర్ కేసును విచారించలేం'
ప్రస్తుత సందర్భంలో శేషాచలం ఎన్ కౌంటర్ కేసు విచారణను స్వీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు, జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ కేసును విచారిస్తున్నందున తాము కలగజేసుకోబోమని, తిరిగి హైకోర్లునే ఆశ్రయించాలని ప్రధాన న్యయమూర్తి హెచ్ ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఎన్ కౌంటర్ బూటకమని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎన్ కౌంటర్ మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
శేషాచలం అటవీప్రాంతంలో 20 మంది ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై నేడు (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు ఈ విచారణను చేపట్టనున్నారు. మృతుల్లో ఒకరైన తిరుమవళం వాసి భార్య ముత్తుకృష్ణ దాఖలుచేసిన పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ఆ మేరకు విచారణ జరపనుంది. ఈ సందర్భంగా వాది, ప్రతివాది తరఫు న్యాయవాదులుతమ వాదనలు వినిపించనున్నారు. ఎన్కౌంటర్ బూటకమని, ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. కూలీలను పట్టుకెళ్లి కాల్చిచంపారని ఆరోపిస్తున్న బాధితులు.. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎన్ కౌంటర్ పై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా నేటినుంచి తన పనిని ప్రారంభించనుంది. ఏప్రిల్ 2న చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో పోలీస్, అటవీశాఖల జాయింట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది 20 మంది ఎర్రచందనం కూలీలను హతమార్చారు. ఈ కేసును ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. -
ఇక ‘సిట్’ విచారణ
► రెండు రోజుల్లో తిరుపతికి రాక ► శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఇంకో దర్యాప్తు ► ఉక్కిరిబిక్కిరి అవుతున్న టాస్క్ఫోర్సు చిత్తూరు (అర్బన్) : ఏ సమయంలో జిల్లా పోలీసులు ఎర్రచందనం కూలీల కాల్చివేతకు పాల్పడ్డారోగానీ.. జరిగిన సంఘటనలపై ఎవరికి సమాధానాలు చెప్పుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి దర్యాప్తు చేయడానికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 20 మంది కూలీల కాల్పుల ఘటనపై రాష్ట్ర మానవహక్కుల సంఘం నుంచి జాతీయ మానవహక్కుల సంఘం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు నిందితులుగా నిలబడ్డ పోలీసులు సిట్ ఏర్పాటుతో మరింత ఇరకాటంలో పడ్డారు. అడవుల్లోకి ప్రవేశించిన కూలీలు నిజంగానే పోలీసులపైకి హత్యాయత్నానికి పాల్పడ్డారా..? అందుకే పోలీసులు కాల్పులు జరిపారా ? అనే దానిపై సిట్‌లోని ఎనిమిది మందితో కూడిన బృందం జిల్లాకు చెందిన టాస్క్ఫోర్సు పోలీసులను, అటవీశాఖ సిబ్బందిని ప్రశ్నించనుంది. ఎన్కౌంటర్ జరిగిన రోజున గాయపడ్డామని చెబుతున్న పోలీసులను సైతం ఈ బృందం విచారిస్తుంది. సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ సాక్ష్యాలను సైతం నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు అందచేయనుంది. ఈ బృందంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కు చెందిన రవిశంకర్ అయ్యర్ (ప్రస్తుతం ఈయన కర్నూలు రేంజ్ డీఐజీగా పనిచేస్తున్నారు) బాధ్యత వహిస్తారు. ఈయనతో పాటు సాంకేతిక విభాగం ఎస్పీ పాలరాజు, పశ్చిమ గోదావరి ఏఎస్పీ చంద్రశేఖర్, సీఐడీ డీఎస్పీలు యుగంధర్, బాబు, రఘు, కోరుకొండకు చెందిన సీఐ చంద్రశేఖర్, తిరుపతి వీఆర్‌లో ఉన్న మరో సీఐ మధుసూదన్ సభ్యులుగా ఉంటారు. సోమవారం ఈ బృందం తిరుపతిలోని ఎన్కౌంటర్లు జరిగిన స్థలాన్ని పరిశీంచి, టాస్క్ఫోర్సు పోలీసులను ప్రశ్నించనుంది. సంఘటన జరిగిన రోజున ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని చెప్పిన పోలీసు యంత్రాంగం వరుస విచారణలతో ఆత్మరక్షణలో పడింది. -
శేషాచలం ఎన్కౌంటర్ కేసు విచారణ 28కి వాయిదా
శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్ పై విచారణను హైకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలను అనుసరించి ఏపీ, తమిళనాడు వైద్యాధికారులు.. ఐదుగురి మృతదేహాలకు రీ పోస్ట్ మార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఈ ఎన్కౌంటర్ పై గురువారం విచారించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని ఫుల్‌బెంచ్ శేషాచలం ఎన్కౌంటర్ ఘటనలపై గురువారం గంటన్నరకుపైగా విచారించింది. కమిషన్‌లో జస్టిస్ డి.మురుగేశన్, జస్టిస్ సి.జోసెఫ్‌లతోపాటు సభ్యుడు ఎస్సీ సిన్హా విచారణలో పాల్గొన్నారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న అటవీ-పోలీసు అధికారుల పూర్తి వివరాలు ఈ నెల 22లోపు సమర్పించాలంటూ 13న జారీచేసిన ఆదేశాలను ప్రస్తావించిన కమిషన్.. ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోలేదని తప్పుపట్టింది. ఏప్రిల్ 9న చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలు మృతిచెందిన సంగతి తెలిసిందే. -
ఎన్ కౌంటర్‌పై విచారణకు అంత నిర్లక్ష్యమా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎందుకు జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయలేదని నిలదీసింది. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో పోలీసులకు ఉచ్చు బిగిస్తున్నట్లవుతోంది. గురువారం ఎన్ హెచ్ ఆర్సీ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ వద్ద పలు కేసులను విచారించింది. ముఖ్యంగా శేషాచలం ఎన్‌కౌంటర్‌తోపాటు వికారుద్దీన్, గత ఏడాది కిషన్‌బాగ్ పోలీసులపై కాల్పుల విచారణ ప్రధానంగా చేసింది. ఈ సందర్భంగా శేషాచలం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఏపీ సర్కార్ తరుపున అడిషనల్ డీజీ లీగల్ ఎఫైర్స్ వినయ్ రంజన్ నివేదిక సమర్పించారు. కాగా, ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి స్వయంగా వెళ్లి ఎన్ హెచ్ ఆర్సీ దర్యాప్తు చేయాలని నిర్ణయించుకొంది. ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగించిన సెల్ నంబర్లనూ ఇవ్వాలని ఆదేశించింది. సమీపంలోని సెల్ టవర్ గుండా వెళ్లిన అన్ని కాంటాక్ట్ డిటెయిల్స్ ఇవ్వాలని ఆదేశించింది. -
ఖాకీల్లో టెన్షన్
► శేషాచలం ఎన్‌కౌంటర్‌పై అంతర్మథనం ► హైకోర్టుకు అందిన రీపోస్టుమార్టం నివేదిక ► తొలి పోస్టుమార్టంతో నివేదిక ఏకీభవించేనా? ► తల పట్టుకుంటున్న టాస్క్ఫోర్సు పోలీసులు చిత్తూరు (అర్బన్): శేషాచలం అడవుల్లో ఈనెల 7న జరిగిన ఎన్‌కౌంటర్‌పై జిల్లా పోలీసు యంత్రాంగంలో ఉత్కంఠ మొదలైంది. ఎన్కౌంటర్లో 20 మంది కూలీలను పోలీసులు కాల్చిచంపడం, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీం కోర్టు, రాష్ట్ర హై కోర్టు తీవ్రంగా పరిగణించడం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు కూలీలకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన రీపోస్టుమార్టం నివేదిక బుధవారం న్యాయస్థానం వద్దకు సీల్డు కవర్లో చేరడంతో పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి విషయాలు వచ్చాయోనని పోలీసు బాసులు అంతర్మథనంలో ఉన్నారు. చిత్రహింసలు పెట్టారని ఆరోపణ.. ఎన్కౌంటర్లో మృతి చెందిన తన భర్త శశికుమార్‌ను పోలీసులు చిత్ర హింసలు పెట్టి చంపారని భార్య మునియమ్మాల్ తొలుత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొదట్లో శశికుమార్ మృతదేహానికి మాత్రమే రీ పోస్టుమార్టం నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇ చ్చింది. తర్వాత మురుగన్, మూర్తి, శివాజి, పెరుమాళ్, మునుస్వామి మృతదేహాలకు సైతం రీ పోస్టుమార్టం నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల చేతుల్లో మృతి చెందిన తమ భర్తల శరీరాలపై నిప్పుతో కాల్చిన గుర్తులు, కాళ్లూ, చేతులు కట్టేసి చిత్ర హిం సలు పెట్టి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయని మృతుల భార్యలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికితోడు కొందరు కూలీల మృతదేహాల్లో చేతివేళ్లు లేవని, మరికొందరికి శరీరంపై బలమైన ఆయుధంతో కోసిన గుర్తులు ఉన్నాయని మృతుల కుటుంబసభ్యులు పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలతో ఇప్పటికే చంద్రగిరి పోలీసులు ఎన్కౌంటర్లో పా ల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. అయితే ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. నివేదికలో ఏముందో ? హైకోర్టుకు బుధవారం అందజేసిన మృతుల రీ పోస్టుమార్టం నివేదిక, తొలుత జరిగిన పోస్టుమార్టం నివేదికతో సరిపోలుతుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తొలుత తిరుపతి రుయా వైద్యశాలలో మృతులకు జిల్లాకు చెందిన వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదిక ఇప్పటికే హైకోర్టులో ఉంది. తాజాగా ఉస్మానియా వైద్యులు నిర్వహించిన రీ పోస్టుమార్టం నివేదిక న్యాయస్థానానికి చేరింది. మొదటిసారి జరిపిన శవపరీక్షకు సంబంధించిన ఫోరెన్సిన్ నివేదిక ఇంకా న్యాయస్థానానికి అందకపోవడంతో కేసు విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ రెండు శవ పరీక్షల నివేదికను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయోనంటూ జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్ర ఉత్కంఠలో ఉంది. -
శేషాచలం ఎన్కౌంటర్ కేసు విచారణ 24కి వాయిదా
-
శేషాచలం ఎన్కౌంటర్ కేసు విచారణ 24కి వాయిదా
హైదరాబాద్ : తిరుపతి శేషాచలం ఎన్కౌంటర్ కేసుపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు మృతులకు పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యులు బుధవారం ఆ నివేదికను కోర్టుకు సమర్పించారు. అంతకుముందు నిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందంతో మృతదేహాలకు మరోసారి శవపరీక్ష నిర్వహించారు. ఆ పోస్టుమార్టం నివేదికను తమకు మాత్రమే ఇవ్వాలన్న ఆదేశాల మేరకు సీల్డు కవర్లో నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళనాడుకు చెందిన కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
ఎన్ కౌంటర్ కేసు:వచ్చే వారానికి వాయిదా వేసిన సుప్రీం
న్యూఢిల్లీ: శేషాచలం అడవుల్లో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు సంబంధించి సీనియర్ న్యాయవాది రాంజెఠ్మాలానీ అందుబాటులో లేకపోవడంతో పిటిషనర్ల విచారణను వాయిదా వేయాలని సుప్రీంకు విన్నవించారు. అందుకు సుముఖత వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఎన్ కౌంటర్ పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ కేసును సీబీఐకు అప్పగించాలంటూ పిటిషనర్ ముత్తు కృష్ణ సుప్రీంకు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. -
ఎన్ కౌంటర్ కేసు విచారణ ఎల్లుండికి వాయిదా
-
ఎన్ కౌంటర్ కేసు విచారణ ఎల్లుండికి వాయిదా
హైదరాబాద్:శేషాచలం అడవుల్లో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. శేషాచలం ఎన్ కౌంటర్ లో మృతిచెందిన వారికి సంబంధించిన పోస్ట్ మార్టం వివరాలను ఈ రోజు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. అయితే ఎల్లుండి లోపు రీ పోస్ట్ మార్టం వివరాలను కూడా అందించాలని కోర్టు పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ నెల మొదటి వారంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
ఆరు మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం పూర్తి
శేషాచలం ఎన్ కౌంటర్ మృతులకు రీ పోస్ట్ మార్టం ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి హైకోర్టు ఆదేశాలమేరకు ఆరుగురు మృతులకు శనివారం తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రిలో రీ పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన వైద్యులు, ప్రొఫెసర్లు రీ పోస్ట్ మార్టంను పర్యవేక్షించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తిరుపతి, హైదరాబాద్ నుంచి వెళ్లిన వైద్యులు, ప్రొఫెసర్లు తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎన్‌కౌంటర్‌పై.. ‘నో కామెంట్’
తిరువళ్లూరు(తమిళనాడు): ఏపీలో తమిళనాడు కూలీలపై జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై స్పందించబోనని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. తిరువళ్లూరులోని ప్రసిద్ధ ఆలయం వీరరాఘవ స్వామి దర్శనం కోసం 3 నెలలకోసారి ఆయన వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం తన సతీమణితో వచ్చిన ఆయనను దర్శనానంతరం మీడియా ప్రతినిధులు చుట్టముట్టారు. ఎన్‌కౌంటర్‌పై మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో ఆయన తల ఊపుతూ ముందుకు కదిలారు. అయితే, మీడియా మాత్రం మాట్లాడాలని కోరింది. దీంతో ఆగ్రహించిన భద్రతా సిబ్బంది మీడియాను తోసేశారు. దీంతో మీడియా ప్రతినిధులకు, భద్రతా సిబ్బందికి మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. అనంతరం, తిరుగు ప్రయాణమవుతున్న గవర్నర్‌ను మీడియా ప్రతినిధులు మరోసారి చుట్టముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో నిమిషం పాటు ఆలోచించిన గవర్నర్.. ‘నో కామెంట్.. నో కామెంట్’ అంటూ వెళ్లిపోయారు. -
'ఏపీ సీఎం చంద్రబాబే పెద్ద టెర్రరిస్టు'
పొట్టి శ్రీరాములు నెల్లూరు టౌన్: టెర్రరిజంతో అధికారం చెలాయించాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద టెర్రరిస్టని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మంగళవారం పద్మావతి మహిళా గ్రంథాలయం ఆవరణంలో ఓపీడీఆర్, పౌరహక్కుల సంఘం సంయుక్తంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పథకం ప్రకారమే చంద్రబాబు ప్రభుత్వం తమిళ కూలీలను పట్టుకుని హతమార్చిందని ఆరోపించారు. అయితే ఒక పత్రిక మాత్రం తమిళ కూలీల హత్యాకాండను ఎన్‌కౌంటర్‌గా పేర్కొంటూ ప్రభుత్వానికి వంతపాడుతోందని విమర్శించారు.