శేషాచలం ఎన్ కౌంటర్ మృతులకు రీ పోస్ట్ మార్టం ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి హైకోర్టు ఆదేశాలమేరకు ఆరుగురు మృతులకు శనివారం తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రిలో రీ పోస్ట్ మార్టం నిర్వహించారు.
ఇరు రాష్ట్రాలకు చెందిన వైద్యులు, ప్రొఫెసర్లు రీ పోస్ట్ మార్టంను పర్యవేక్షించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తిరుపతి, హైదరాబాద్ నుంచి వెళ్లిన వైద్యులు, ప్రొఫెసర్లు తిరుగు ప్రయాణమయ్యారు.