
ఎన్ కౌంటర్ కేసు:వచ్చే వారానికి వాయిదా వేసిన సుప్రీం
న్యూఢిల్లీ: శేషాచలం అడవుల్లో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు సంబంధించి సీనియర్ న్యాయవాది రాంజెఠ్మాలానీ అందుబాటులో లేకపోవడంతో పిటిషనర్ల విచారణను వాయిదా వేయాలని సుప్రీంకు విన్నవించారు.
అందుకు సుముఖత వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఎన్ కౌంటర్ పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ కేసును సీబీఐకు అప్పగించాలంటూ పిటిషనర్ ముత్తు కృష్ణ సుప్రీంకు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.