
ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ ఖరారు
హైదరాబాద్: నూతన ఎక్సైజ్ పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మద్యం దుకాణాల నుంచి వసూలు చేయాల్సిన రుసుమును జనాభా ప్రాతిపదికన ఎక్సైజ్ శాఖ ఖరారు చేసింది. సంవత్సరం కాలవ్యవధితో ఈ ఫీజులు అమల్లో ఉంటాయి.
10 వేల లోపు జనాభా ప్రాంతంలో ఉన్న షాపు ఫీజు రూ. 32.50 లక్షలు
10 నుంచి 50 వేల లోపు జనాభా షాపు ఫీజు రూ. 36 లక్షలు
50 వేల నుంచి 2 లక్షల జనాభా షాపు ఫీజు రూ.45 లక్షలు
3 నుంచి 5 లక్షల జనాభా షాపు ఫీజు రూ. 50 లక్షలు
5 నుంచి 20 లక్షల జనాభా షాపు ఫీజు రూ. 64 లక్షలు
50 వేల జనాభా ఉన్న బార్‌కు ఫీజు రూ. 25 లక్షలు
5 లక్షల లోపు జనాభా ఉన్న బార్‌కు ఫీజు రూ. 38 లక్షలు
5 నుంచి 25 లక్షల జనాభా ఉన్న బార్‌కు ఫీజు రూ.41 లక్షలు