సాక్షి, మంచిర్యాల/కలెక్టరేట్: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా సర్కా రు కొలువుల జాతర ఆరంభించింది. కోర్టు జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ), గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో), పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో వీఆర్వో53, వీఆర్‌ఏ 83 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 2న రాత పరీక్ష జరుగనుండగా, డిసెంబర్ 28 నుంచి ఈనెల 13 వరకు దరఖాస్తులు సమర్పించడానికి గడువుగా నిర్ణయించా రు. సోమవారంతో గడువు ముగియగా భారీగా దరఖాస్తులు వచ్చాయి.
పీజీ అర్హత గల వారు కూడా దరఖాస్తు
వీఆర్‌ఏ, వీఆర్వో పోస్టులకు ఎస్సెస్సీ, ఇంటర్ అర్హతగా ప్రకటించడంతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉన్నత విద్యావంతులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో నెలకు రూ.30 వేలకుపైగా ఆదా యం ఆర్జించే వారు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారు పోటీ పడుతున్నారు. కాగా, పరీక్ష రాసే అభ్యర్థులు ప్రధానంగా జనరల్ స్టడీస్, అర్ధమెటిక్, లాజికల్ స్కిల్స్ అంశాలపై పట్టు సాధించేందుకు శిక్షణ కేంద్రాలకు వెళ్తున్నారు. పరీక్షకు గడువు సమీపిస్తున్నందు న అభ్యర్థులు హైరానా పడుతున్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకు సిలబస్, ఇంటర్ సిల బస్ లభ్యం కావాలంటే ఆ మెటీరియల్‌ను వెతకడమే కష్టం.
రూ.1.50 కోట్లకు పైగా ఆదాయం
వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షలు ప్రభుత్వానికి కాసులవర్షం కురిపించా యి. ఈ పరీక్షలకు నిర్ణయించిన పరీక్ష ఫీజుతో రూ.1.50 కోట్లపైనే ఆదాయం సమకూరింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం రూ.150 పరీక్ష ఫీజు నిర్ణయించింది. దీంతో వీఆర్‌ఏ పోస్టుకు సుమారు 900 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుపై రూ.150 చొప్పున రూ.1.35 లక్ష ఆదాయం వచ్చింది. మిగతా కేటగిరీ అభ్యర్థులు 1,087 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుపై రూ.300 చొప్పున రూ.3.26 లక్షల ఆదాయం సమకూరింది.
వీఆర్‌వో పోస్టు కోసం సుమారు 19 వేల మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుపై రూ.150 చొప్పున రూ.28.50 లక్షలు వస్తే.. మిగతా 45,619 మంది అభ్యర్థుల పేరిట రూ.300 చొప్పున రూ.1.36 కోట్ల ఆదాయం సమకూరింది. 2012లో చేపట్టిన వీఆర్‌వో పోస్టులకు జిల్లావ్యాప్తంగా 15,394 మంది దరఖాస్తు చేసుకుంటే వీఆర్‌ఏ పోస్టులకు 4 వేల మంది దరఖాస్తు చేశారు. అప్పట్లో ఒక్కో దరఖాస్తుకు రూ.200 ఖరారు చేయడంతో ప్రభుత్వానికి రూ.38.78 లక్షల ఆదాయం సమకూరింది. కానీ ఈసారి పోస్టులతోపాటు దరఖాస్తులు పెరగడంతో ఊహించని విధంగా ఆదాయం వచ్చింది. ఇదిలావుంటే.. గత నియామకాల్లో వీఆర్‌ఏ పోస్టులకు 4 వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. ఈసారి కేవలం 1,987 మంది మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించడం గమనార్హం.
66,606 వీఆర్‌ఏ, వీఆర్వో దరఖాస్తులు
Published Tue, Jan 14 2014 5:49 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement