
రోడ్డునపడిన బతుకులు
భోగాపురం: స్థానిక నారుపేట వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆంధ్రా టింబర్స్ ప్లైవుడ్ కంపెనీ మూతపడింది. దీంతో 25 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ముడిసరుకు అందని కారణంగా కంపెనీ మూసివేస్తున్నట్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. కంపెనీలో 73 మంది పర్మినెంట్ కార్మికులు ఉండగా, రోజు వేతనాలతో సుమారు 120 మంది పనిచేస్తుంటారు.
హఠాత్తుగా కంపెనీ మూసేస్తే రిటైర్‌మెంట్ వయసుకు వచ్చిన తమకు ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం దొరుకుతుంది? భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? ఎటువంటి అదనపు బెనిఫిట్స్ ఇవ్వకుంటే మా పరిస్థితి ఏంటని ? పర్మినెంట్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు బెనిఫిట్స్ చూపించినంత వరకు పర్మినెంట్ వర్కర్స్ అంతా కంపెనీ నుంచి బయటకు వెళ్లేదిలేదని భీష్మించారు. పని ఉన్నా లేకపోయినా వారంతా ఈనెల ఒకటో తేదీ నుంచి రోజూ కంపెనీకి వెళ్లి తమ హాజరు వేసుకుంటున్నారు.