ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్ : తమ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతం రూ. 10వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారానికి పదో రోజుకు చేరుకుంది. సమ్మె చేపట్టి పది రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయు డివిజన్ ప్రధానకార్యదర్శి తుమ్మ విష్ణువర్ధన్, సీఐటీయు ఖమ్మం అంగన్‌వాడీల అర్బన్ ప్రాజెక్టు గౌరవధ్యక్షులు మర్రి బాబురావులు మాట్లాడుతూ నిత్యం ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే అంగన్‌వాడీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి సరికాదని అన్నారు.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల వల్ల అంగన్‌వాడీలు బతికే పరిస్థితి లేదని, అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు అర్బన్ మండల కార్యదర్శి నవీన్‌రెడ్డి, ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు కలంగి ప్రమీల, సుధారాధ, నాయకులు నాగ మణి, బాలకుమారి, మంగ, అంజలి, రజియా పాల్గొన్నారు.
కళ్లకు గంతలతో అంగన్‌వాడీల నిరసన
Published Thu, Feb 27 2014 4:46 AM | Last Updated on Sat, Jun 2 2018 8:32 PM
Advertisement
Advertisement