
అనంతపురం కూడేరు: అంగన్‌వాడీలకు ప్రభుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్ ఒకటి పేలింది. కూడేరు మండలం మరుట్ల–3వ కాలనీ అంగన్‌వాడీ కార్యకర్త విజయకుమారి తనవద్దనున్న కార్బన్ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో చార్జింగ్ పెట్టి తను ఇంటి బయట పనిలో నిమగ్నమైంది. కొంతసేపటి తర్వాత పెద్ద శబ్దం వినిపించడంతో ఆమె లోపలికి వెళ్లి చూడగా సెల్‌ఫోన్ పేలి పొగలు రావడం కనిపించింది. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment