phone blast
-
Smartphone: స్మార్ట్ఫోన్లు పేలుతున్నాయ్.. జాగ్రత్తలు మన చేతుల్లో కూడా!
పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు పనుల్ని చక్కబెట్టడంలో స్మార్ట్‌ఫోన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్మార్ట్‌ఫోన్ వల్ల తరచూ ప్రమాదాలు కూడా జరుగుతుండడం చూస్తున్నాం.. వింటున్నాం. మొన్నీమధ్యే ఓ అడ్వొకేట్ గౌన్‌లో ఫోన్ పేలిందన్న వార్త, దీనికి ముందు విమానంలో ఫోన్ పేలిపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ కావడం, అంతకు ముందు ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడిన యువతి దుర్మరణం.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఫోన్ వాడకంలో కొన్ని కనీస జాగ్రత్తలు పాటిస్తే.. ఇలాంటి ఘటనలు నివారించిన వాళ్లం అవుతామంటున్నారు నిపుణులు. చాలామంది స్క్రీన్ పగిలిన ఫోన్లను అలాగే వాడేస్తుంటారు. రిపేరింగ్‌కు బద్ధకిస్తుంటారు. ఇలా ఫోన్లను ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు టెక్ నిపుణులు. కారణం.. అలా పగిలిన చోటు నుంచి నీరు లేదంటే చెమట ఫోన్ లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా బ్యాటరీ, లోపలి భాగాలు పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు ఫోన్‌పై ఒత్తిడి పెరిగి మంటలు చెలరేగి.. పేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్ పాడైన వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి. అంతేకాదు స్క్రీన్ గార్డ్‌కు క్రాక్స్ వచ్చినా వెంటనే మార్చేయడం ఉత్తమం. కరోనా వల్ల ఈమధ్య శానిటైజర్లను ఫోన్లకు సైతం వాడేస్తున్నారు కొందరు. అయితే ఛార్జింగ్ సాకెట్ల ద్వారా లిక్విడ్ లోపలికి వెళ్లి.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టిష్యూస్‌తో అదీ జాగ్రత్తగా తుడవడం బెటర్ అని సూచిస్తున్నారు. డుప్లికేట్ ఛార్జర్లు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.. ఫోన్లలో చాలా వరకూ వీటితోనే నడుస్తున్నాయి. బ్యాటరీలు, ఛార్జింగ్ వైర్లు, అడాప్టర్లను స్పెషల్ టెక్నాలజీతో తయారు చేస్తున్నాయి కంపెనీలు. కాబట్టి, తక్కువ ధరలో దొరికే డుప్లికేట్ ఛార్జర్లు, బ్యాటరీలు ఉపయోగించకపోవడం ఉత్తమం. ఇక ఇతరుల ఫోన్ల ఛార్జర్లను(వేరే కంపెనీలవి) సైతం అత్యవసర సమయంలోనే ఉపయోగించాలని నిపుణులు చెప్తున్నారు. డుప్లికేట్ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల ఫోన్ బ్యాటరీ వేడెక్కి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. అందుకే ఫోన్లో బ్యాటరీ ఛేంజ్ చేసేప్పుడు కంపెనీ సూచించిన బ్యాటరీనే ఉపయోగించడం మేలు. ఇలా చేయకపోవడం బెటర్ ► సూర్యరశ్మి తగిలే చోటులో ఫోన్ వేడెక్కడం సహజం. అలా సూర్యరశ్మి పడే చోట ఛార్జింగ్ పెట్టడం మంచిది కాదు. ► ఫోన్‌పై అదనంగా ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఛార్జ్ చేసేప్పుడు ఫోన్‌పై ఎలాంటి వస్తువులు ఉంచకపోవడం ఉత్తమం. ► ఛార్జింగ్ టైంలో ఫోన్ వేడెక్కుతున్నట్లు గమనిస్తే వెంటనే అన్‌ఫ్లగ్ చేయాలి. ► వర్షాలు పడుతున్న టైంలో ఛార్జింగ్ పెట్టి ఫోన్లు ఉపయోగించడం అస్సలు మంచిది కాదు. ► ఫోన్ వేడెక్కినట్లు అనిపిస్తే.. సర్వీస్ సెంటర్ తీసుకెళ్లి చెక్ చేయించాలి. ► వంద శాతం ఛార్జింగ్.. చాలామందికి ఇదొక ఆనందం. కొన్నిసార్లు రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేస్తారు. అలాంటప్పుడు వేడెక్కి పేలిపోవచ్చు. వెహికిల్స్‌లో ఛార్జింగ్ పెట్టేందుకు ఉపయోగించే పవర్ కేబుల్స్, పవర్ బ్యాంక్‌లను.. ఇంట్లో పవర్ ప్లగ్ నుంచి ఫోన్‌ని ఛార్జ్ చేసేందుకు ఉపయోగిస్తుంటారు. కానీ, పవర్ సప్లైలో తేడా ఉంటుందనే విషయం, ఆ కేబుల్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. వాటితో ఫోన్లు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి. వీటితో పాటు కాస్ట్లీ ఫోన్లలో సమస్య తలెత్తినప్పుడు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలో రిపేర్ చేయించడం బెటర్. పైగా ఫోన్లో కంపెనీ యాక్ససరీలు కాకుండా థర్డ్ పార్టీ యాక్ససరీలు ఉపయోగించడం వల్ల ఫోన్‌పై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. టెక్నికల్ లోటుపాట్లను పక్కనపెడితే.. మన చేతుల్లో ఉన్న జాగ్రత్తల్ని పాటించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించొచ్చనే చెప్తున్నారు టెక్ ఎక్స్పర్ట్స్. - సాక్షి, వెబ్‌స్పెషల్ చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
సెల్ ఫోన్ పేలి చూపు కోల్పోయిన యువతి
సాక్షి, చెన్నై: సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి వీడియో కాల్ మాట్లాడుతున్న సయయంలో దురదృష్టవశాత్తూ ఫోన్ పేలడంతో ఓ యువతి చూపు కోల్పోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...తిరువారూరు జిల్లా నీడామంగళం ముట్టయ్యకొత్తనార్ తందు ప్రాంతానికి చెందిన సుకుమార్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కుమార్తె ఆర్తి సోమవారం తన తండ్రితో వీడియో కాల్లో మాట్లాడుతోంది. అయితే అకస్మాత్తుగా సెల్ పేలడంతో... ఆ ముక్కలు ఆర్తి కళ్ళలో గుచ్చుకున్నాయి. చెవిలోకి కూడా వెళ్లాయి. దీంతో కుటుంబీకులు ఆర్తీని వెంటనే నీడామంగళం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్సకు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకుప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సెల్ ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా సెల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఉపయోగించడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఫోన్ వాడకంపై అజాగ్రత్తగా ఉండటం వల్లే గాయపడటంతో పాటు, ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా జనాల్లో అవగాహన లేకుండా పోతోంది. ఛార్జింగ్ పెట్టిన ఫోన్‌ని అలాగే మాట్లాడటం, తడి చేతులతో ఛార్జింగ్ పెట్టడంతో పాటు రాత్రంతా చార్జింగ్ పెట్టిన ఫోన్లు విపరీతంగా వేడెక్కి పేలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫోన్లు వాడకాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసినా, పట్టించుకోకపోవడంతోనే ఇటువంటి సంఘటనలకు దారితీస్తున్నాయి. -
పేలిన ఫోన్ యువకునికి తీవ్రగాయాలు
కర్ణాటక, మైసూరు: మొబైల్ హఠాత్తుగా పేలిపోవడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన సోమవారం నంజనగూడు తాలూకా హుల్లహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. కురిహుండి గ్రామానికి చెందిన బవసరాజు బైకుపై కురిహుండి గ్రామం నుంచి హుల్లహళ్లి గ్రామానికి వెళుతున్నాడు. అదే సమయంలో ఫోన్ రావడంతో కాసేపు మాట్లాడిన అనంతరం మొబైల్‌ను జేబులో పెట్టుకొని ముందుకు కదిలాడు. కొద్ది దూరం వెళ్లగానే మొబైల్‌ఫోన్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోవడంతో బైకు అదుపుతప్పి రోడ్డుపై పడింది. ఘటనలో బసవరాజుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.హుల్లహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
త‘స్మార్ట్’ జాగ్రత్త
రిజర్వేషన్ కావాలన్నా.. సరుకులు కొనాలన్నా.. బిల్లులు కట్టాలన్నా.. ఒకటేమిటి.. దేనికైనా.. గుమ్మం కదలనక్కర లేదు. చాంతాడంత క్యూల్లో నిల్చోనక్కర లేదు. ఆపసోపాలు పడనక్కర లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. చిటికెలో పనులు చేసుకుంటున్నారు. ఎక్కువ సమయం ఫోన్లతోనే గడుపుతున్నారు. మాట్లాడుతూ.. చాటింగ్ చేస్తూ.. సినిమాలు చూస్తూ.. రోజులో సగటున నాలుగైదు గంటలు ఫోన్లకే వెచ్చిస్తున్నారు. చేతిలో ఉన్నంతసేపూ చాటింగ్.. లేదా చార్జింగ్.. చార్జింగ్ చేస్తూ మళ్లీ చాటింగ్.. ఇదే ప్రమాదకరంగా మారుతోంది. సెల్ఫోన్లు పేలిపోతూ ప్రాణాలు హరిస్తున్నాయి. ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు రావని నిపుణులు సూచిస్తున్నారు. – విజయనగరం మున్సిపాలిటీ దాదాపు ప్రస్తుతం అందరూ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. వీటితో ఎంత ప్రయోజనం ఉందో.. వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తే అంత ముప్పు కూడా పొంచి ఉంది. మొబైల్ పేలుతున్న సంఘటనల్లో ఎక్కువ శాతం చవగ్గా కొనుగోలు చేసినవి.. బ్రాండెడ్ కానివి మాత్రమే ఉంటున్నాయి. తక్కువ ధరకు వస్తున్నాయని కొంటున్న ఫోన్లు ఎంతవరకు భద్రమో తెలుసుకోవాలి. మొబైల్స్‌లో బ్యాటరీ అత్యంత కీలకం. నాసిరకానివి లోపాలతో పేలుతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఫోన్లలో ఆయా సంస్థలు భద్రత పరంగా తీసుకునే చర్యలు పెద్దగా ఉండవు. ఎక్కువ సేపు మాట్లాడితే చాలు వేడెక్కి పేలిపోతుంటాయి. చార్జింగ్‌లో అజాగ్రత్తలతో ముప్పు చార్జింగ్ అవుతుండగా చాలామంది మాట్లాడుతుంటారు. వాట్సాప్, వీడియోలు చూస్తుంటారు. వీడియో గేమ్స్ ఆడుతుంటారు. ప్రమాదమని తెలిసినా తేలిగ్గా తీసుకోవడంతో చిక్కులు వస్తున్నాయి. మొబైల్‌ను ఇతర విద్యుదుపకరణాలపై పెట్టడం సరికాదు. చార్జింగ్ పాయింటు ఉంది కదా అని రిఫ్రిజిరేటర్, టీవీపై కొందరు పెడుతుంటారు. అది ప్రమాదకరం. ఫోన్ కొన్నప్పుడు ఇచ్చిన చార్జర్‌నే వాడాలి. ఇతర చార్జర్లతో ఫలితమున్నట్లు కనిపించినా అవుట్‌పుట్, ఇన్పుట్ ఓల్టేజీలో తేడాలుంటే ప్రమాదాలు సంభవిస్తాయి. చార్జర్ పోతే అదే సంస్థకు చెందినది తీసుకోవాలి. చౌకగా వస్తుందని నకిలీ చార్జర్లు వాడితే మన్నిక మూడు కాలాలే. మెలకువగా ఉన్నంతసేపు ఫోన్లు రావడం, అంతర్జాలం చూడటంతో చార్జింగ్ కుదరడం లేదు. దీంతో రాత్రి నిద్రించే ముందు పెడుతున్నారు. ఆధునిక స్మార్ట్ ఫోన్లు అర్ధగంటలో చార్జింగ్ అవుతున్నాయి కాబట్టి.. ఉదయం లేచాక చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీలో చార్జింగ్ పూర్తికాగానే ఆగిపోతుంది. పేలిపోడానికి కారణాలివే ఫోన్లు పేలడానికి ప్రధానంగా డిజైన్, బ్యాటరీ, తయారీలో లోపాలూ కారణమవుతాయి. చాలా సంస్థలు వీటిలో ఉపయోగించే పరికరాలను వేర్వేరు సంస్థలకు అప్పగిస్తుంటాయి. నిపుణులతో పాటు అంతగా నైపుణ్యం లేనివారూ ఉంటారు. చైనా మొబైల్స్‌తో కూడా అక్కడక్కడా సమస్యలు వస్తున్నాయి. తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ అంటే బ్యాటరీ నాణ్యతలో రాజీ పడాల్సి వస్తుంది. ఆ మధ్య ఓ సంస్థ ఫోన్ స్లిమ్‌గా ఉండాలని బ్యాటరీ లోపలే ఉండేలా డిజై¯Œన్ చేసింది. అప్పటివరకు తీసి పెట్టుకునేలా ఉండేది. బ్యాటరీ లోపలే ఉండటం, ఆ పక్కన స్థలం లేకుండా పోవడంతో పేలిన సంఘటనలున్నాయి. మొబైల్స్ సైతం సంకోచ, వ్యాకోచాలకు గురవుతుంటాయి. లోపల తగినంత ఖాళీ స్థలం ఉంటే ఇబ్బంది ఉండదు. లేనివి వాతావరణ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. చాలా ఫోన్లు బ్యాటరీ ఉబ్బిపోయి.. కవర్ ఊడిపోయిన దాఖలాలున్నాయి. చాలామంది బిగుతుగా ఉండే జీన్స్ ప్యాంట్లో ఫోన్లు పెట్టుకుంటారు. తగిన గాలి ఆడక కూడా పేలడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎర్తింగ్ సమస్యలు ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ఓసారి అంతటా పరిశీలించుకోవాలి. చార్జింగ్‌లో మాట్లాడొద్దు ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ ఫోన్లపైనే మక్కువ పెంచుకుంటున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా గంటల తరబడి వాట్సాప్‌లు, ఫెస్బుక్ల్లో చాటింగ్‌లో, వీడియో కాల్స్ పేరిట మాట్లాడుతున్నారు. బ్యాటరీలో చార్జింగ్ తగ్గుతుంటే ఆ సమయాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. ఓ వైపు బ్యాటరీ చార్జ్ అవుతుండగానే.. మరో వైపు వారి పని కానిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇటీవల ఓ సంస్థ సెల్ఫోన్లు చార్జింగ్ అవుతుండగా బ్యాటరీలు పేలిపోయినట్టు వార్తలు వచ్చాయి. అలాంటి సమస్య ఎవరికైనా ఎదురుకావచ్చు. – ఎన్.లక్ష్మణరావు, సెల్‌ఫోన్ మెకానిక్, విజయనగరం. -
పేలిన అంగన్వాడీ స్మార్ట్ ఫోన్
అనంతపురం కూడేరు: అంగన్వాడీలకు ప్రభుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్ ఒకటి పేలింది. కూడేరు మండలం మరుట్ల–3వ కాలనీ అంగన్వాడీ కార్యకర్త విజయకుమారి తనవద్దనున్న కార్బన్ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో చార్జింగ్ పెట్టి తను ఇంటి బయట పనిలో నిమగ్నమైంది. కొంతసేపటి తర్వాత పెద్ద శబ్దం వినిపించడంతో ఆమె లోపలికి వెళ్లి చూడగా సెల్‌ఫోన్ పేలి పొగలు రావడం కనిపించింది. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. -
ప్రమాదవశాత్తు పేలిన సెల్‌ఫోన్
స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్ కేంద్రంలోని జేకే గార్డెన్స్ ఎదురుగా ఉన్న «ధనలక్ష్మీ మొబైల్ షాపులో రిపేర్ చేస్తుండగా ఎంఐ స్మార్ట్‌ఫోన్ పేలిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఉన్నాయి. మొబైల్ షాపుకు కస్టమర్ రిపేర్ కోసం ఇచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను షాపులో పనిచేసే రాకేష్ రిపేర్ చేసేందుకు ఫోన్ విప్పుతుండగా ఒక్కసారిగా వేడై పేలింది. కాగా ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరుగలేదు. ఒక్కసారిగా సెల్‌ఫోన్ పేలిపోవడంతో షాపు యజమాని, వర్కర్, కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. -
ఫోన్ ఆన్సర్ చేస్తుంటే.. పేలిపోయింది!
ఫోన్ చార్జింగ్‌లో ఉండగా రింగ్ అయినప్పుడు అలాగే ఉంచి దాన్ని ఆన్సర్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. ఎందుకంటే, చెన్నై నగరంలో అలాగే చార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ను తొమ్మిదేళ్ల బాలుడు ఆన్సర్ చేయబోతుండగా అది పేలిపోయింది. దాంతో అతడి కంటి చూపు దారుణంగా దెబ్బతింది. ధనుష్ అనే ఆ బాలుడిని వెంటనే మదురాంతకంలో ఉన్న కంటి ఆస్పత్రికి తరలించారు. అతడు ఫోన్ ఆన్సర్ చేస్తుండగానే అది పేలిపోవడంతో ముఖం మీద, కళ్లు, చేతుల మీద కూడా తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. పేలుడు తీవ్రత వల్ల అతడి కుడి కంటి కార్నియా దెబ్బ తినడమే కాక, ఎడమ కంటి గ్లోబును కూడా బాగా పాడుచేసిందని, ఫోను పట్టుకున్న కుడి చేతికి కూడా బాగా కాలిన గాయాలయ్యాయని చికిత్స అందిస్తున్న డాక్టర్ వహీదా నజీర్ చెప్పారు. మూడు వారాల తర్వాత అతడికి చికిత్స పూర్తయ్యి ఇంటికి వెళ్లొచ్చని వివరించారు. -
సెల్‌ఫోన్‌తో ప్రమాదాలు.. జాగ్రత్త!