
గాయపడిన యువకుడు
కర్ణాటక, మైసూరు: మొబైల్ హఠాత్తుగా పేలిపోవడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన సోమవారం నంజనగూడు తాలూకా హుల్లహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. కురిహుండి గ్రామానికి చెందిన బవసరాజు బైకుపై కురిహుండి గ్రామం నుంచి హుల్లహళ్లి గ్రామానికి వెళుతున్నాడు. అదే సమయంలో ఫోన్ రావడంతో కాసేపు మాట్లాడిన అనంతరం మొబైల్‌ను జేబులో పెట్టుకొని ముందుకు కదిలాడు. కొద్ది దూరం వెళ్లగానే మొబైల్‌ఫోన్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోవడంతో బైకు అదుపుతప్పి రోడ్డుపై పడింది. ఘటనలో బసవరాజుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.హుల్లహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.