తిరుమల కల్చరల్, న్యూస్‌లైన్: తిరుమలలో శనివారం భక్తులకు టీటీడీ అధికారులు క్యూల వద్దనే అన్నప్రసాదాలను వితరణ చేశారు. పెరటాసి నెల (తిరుమల నెల) రెండవ శనివారం కావడం తో వేకువజాము నుంచి రాత్రి వరకు భక్తులు కాలినడకన తిరుమలకు వేలసంఖ్యలో చేరుకున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తులతో నిండిపోయాయి. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలలో కిలోమీటర్ల మేర బారులుతీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ ఉన్నతాధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా ఆలయ డెప్యూటీఈవో చిన్నంగారి రమణ వివిధ విభాగాల అధికారులతో కలిసి క్యూలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద వితరణ, తాగునీటి పంపిణీ తీరును పరిశీలించారు. క్యూల వద్దకు వెళ్లి ఎమైనా ఇబ్బందులు ఉన్నాయా, సమయానికి అన్నప్రసాదాలు లభిస్తున్నాయా అనే విషయాలపై ఆరా తీశారు. కేవలం పెరుగన్నం, సాంబరన్నమే కాకుండా, పులిహోర, పాలు కూడా క్యూలైన్‌లోని భక్తులకు అందజేయాలని అన్నదానం అధికారులను ఆదేశించారు.
కొంత సమ యం ఆయన స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. వివిధ దర్శన సమయూలను మైక్‌సెట్ ద్వారా ప్రకటనలు చేరుుంచారు. రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం ఒంటి గంటకే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూను నిలిపివేసి సామాన్య భక్తులకే ప్రధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందులో హెల్త్‌ఆఫీసర్ వెంకటరమణ, అన్నదానం క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు అన్నప్రసాద వితరణ
Published Sun, Sep 29 2013 3:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement