Drinking water distribution
-
8% గృహాలకు వారంలో ఒక్క రోజే నీరు
న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8% గృహాలకు వారంలో కేవలం ఒక్కరోజు నీరు సరఫరా అవుతుండగా, 74% మందికి వారమంతా అందుతున్నట్లు కేంద్రం జల్‌శక్తి శాఖ అధ్యయనంలో వెల్లడైంది. మరో 4% గృహాలకు వారంలో ఐదారు రోజులు, 14% మందికి కనీసం మూడు, నాలుగు రోజులు నీరు అందుతోందని ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. మొత్తమ్మీద సరాసరిన రోజుకు మూడు గంటలు చొప్పున నీరు సరఫరా అవుతున్నట్లు వివరించింది. తమ ఇళ్లలోని కుళాయిల ద్వారా అందే నీటితో రోజువారీ అవసరాల్లో 80% వరకు తీరుతున్నట్లు ప్రతి ఐదుగురిలో నలుగురు తెలిపినట్లు నివేదిక పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, యూపీల్లో కుళాయి కనెక్షన్లు లేని గృహాలు అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. కనీసం ఆరు రాష్ట్రాల్లోని 30%పైగా గృహాలకు గత వారం రోజులుగా కుళాయి నీరు కాలేదని వెల్లడైంది. ‘హర్ ఘర్ జల్’ పథకం అమలవుతున్న 91% గృహాల్లోని కుళాయిలు సర్వే చేపట్టిన రోజు పనిచేస్తున్నట్లు గుర్తించారు (జాతీయ స్థాయిలో ఇది 86%). 91% గృహాలకు 88% గృహాలకు అవసరాలకు సరిపోను (రోజుకు ప్రతి వ్యక్తికి 55 లీటర్లకు మించి) నీరు అందుతుండగా, 84% ఇళ్లకు రోజూ సరఫరా అవుతోంది. 90% గృహాలకు కుళాయిల ద్వారా మంచినీరు అందుతోంది. -
పట్టణాల్లో నీటి ఎద్దడికి రూ.8,217 కోట్లతో చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం అమృత్, ఏఐఐబీ నిధులు, ప్లాన్ గ్రాంట్ నిధులు.. మొత్తం మీద రూ.8,216.95 కోట్లను వెచ్చిస్తోంది రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు కలిపి 125 ఉండగా.. 59 పట్టణాల్లో రోజుకు ఒకసారి, 34 పట్టణాల్లో రెండు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా చేయగలుగుతున్నారు. 13 పట్టణాల్లో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని పురపాలక శాఖ ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టింది. నగరాలు, పట్టణాల్లో రోజుకు 1,750 మిలియన్ లీటర్ల (ఎంఎల్) తాగునీరు అవసరం కాగా ప్రస్తుత తాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం రోజుకు 1,678 మిలియన్ లీటర్లు. 72 మిలియన్ లీటర్ల నీటిని ఇతర మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నారు. 2035 నాటికి రోజుకు 2,700 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరమని పురపాలకశాఖ అంచనా వేసింది. అంటే ప్రస్తుత వ్యవస్థీకృత సామర్థ్యం కంటే 1,022 మిలియన్ లీటర్లు ఎక్కువ అవసరం. ఆ మేరకు వ్యవస్థీకృత సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది. 32 మునిసిపాలిటీల్లో ‘అమృత్’ధారలు లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లో అమృత్ పథకం కింద తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,762.91 కోట్లు. దీన్లో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1,056.62 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.436.97 కోట్లు, మునిసిపాలిటీల వాటా రూ.2,088.55 కోట్లు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.180.77 కోట్లు సమకూరుస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,762.91 కోట్లలో తాగునీటి సరఫరాకు రూ.2,526.33 కోట్లు వెచ్చించనున్నారు. ఆ 32 మునిసిపాలిటీల్లో అదనంగా రోజుకు 307 మిలియన్ లీటర్ల తాగునీరు అందించనున్నారు. దీనికోసం కొత్తగా 4,36,707 ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇస్తారు. ఏఐఐబీ నిధులతో 50 మునిసిపాలిటీలకు.. ఆసియన్ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బ్యాంక్ (ఏఐఐబీ) నిధులతో మరో 50 మునిసిపాలిటీల్లో ప్రాజెక్టులు చేపట్టారు. మొత్తం 33 లక్షల జనాభాకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని మొత్తం వ్యయం రూ.5,350.62 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటా రూ.3,487.67 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,494.72 కోట్లు కాగా మునిసిపాలిటీల వాటా రూ.368.23 కోట్లు. మొదటిదశ కింద ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో, రెండో దశలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టు చేపడతారు. ప్లాన్ గ్రాంట్ నిధులతో రాయచోటిలో రోజుకు 35 మిలియన్ లీటర్ల తాగునీరు అందించడంతోపాటు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.340 కోట్ల ప్రాజెక్టును చేపట్టారు. -
నీటి పరీక్ష.. పనుల నాణ్యతపై సమీక్ష
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎవరు ఏ పనులు చేయాలనేది నిర్ధారిస్తూ విభాగాల వారీగా ప్రభుత్వం ఇప్పటికే జాబ్ చార్ట్‌లను విడుదల చేసింది. సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చేయాల్సిన పనులకు సంబంధించి జాబ్ చార్ట్‌ను కూడా రూపొందించింది. దీని ప్రకారం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కుళాయిల ద్వారా తాగునీటిని విడుదల చేసే సమయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విధిగా నీటి పరీక్షలు నిర్వహించాలి. సచివాలయ పరిధిలో తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్యలు తలెత్తినా సదరు ఉద్యోగి బాధ్యత వహించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాబ్ చార్ట్ పేర్కొన్న పనుల వివరాలివీ... - రోజూ ఉదయాన్నే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి. తన సచివాలయ పరిధిలోని ఇంజనీరింగ్ కార్యకలాపాలు, పనుల నాణ్యతను తనిఖీ చేయాలి. - పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు సంబంధించి సమస్యలేమైనా ఉంటే గుర్తించి సంబంధిత ఇంజనీరింగ్ శాఖకు తెలియజేయాలి. - తాగునీటి పైపు లైన్లలో లీకేజీలను గుర్తించి వాటి నిరోధానికి చర్యలు తీసుకోవాలి. - పంప్ హౌస్‌లు, సర్వీసు రిజర్వాయర్లను తనిఖీ చేయాలి. పైప్‌లైన్ చివరి పాయింట్ వరకు నీటి సరఫరా జరుగుతోందా లేదా పరిశీలించాలి. - గృహ నిర్మాణాలతో పాటు సివిల్ పనులన్నిటినీ అమలు చేయించాలి. సివిల్ పనులు, గృహ నిర్మాణాల్లో ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ప్రకారం నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలించి మూవ్మెంట్ రిజిస్టర్ నిర్వహించాలి. - రహదారుల నిర్వహణ పనులను గుర్తించాలి. ఎక్కడైనా గుంతలు పడితే పూడ్చేందుకు అవసరమైన అంచనా ప్రతిపాదనలను రూపొందించాలి. - స్పందనలో వచ్చిన సమస్యలపై నోట్‌ను రూపొందించాలి. ఆయా గ్రామాల సమస్యలను కూడా నోట్లో పొందుపరిచి పరిష్కారం నిమిత్తం పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి. - పారిశుధ్య నిర్వహణ, కార్యకలాపాలు, వ్యర్థాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శితో సమన్వయం చేసుకోవాలి. - భవన నిర్మాణాల అనుమతి దరఖాస్తుల ఆధారంగా సాంకేతిక తనిఖీలను నిర్వహించాలి. - డ్రెయినేజీ, వాటర్ ట్యాంక్‌లో నూటికి నూరు శాతం పూడిక తీయించాలి. - గృహాలతో పాటు మౌలిక సదుపాయాల పనులకు సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను అంచనాలతో రూపొందించాలి. - క్షేత్రస్థాయి పర్యటనల సందర్భంగా పనుల అమలు తీరుతెన్నులను ఫీల్డ్ రిజిస్టర్లో నమోదు చేయాలి. పనుల పురోగతి ఫొటోలు కూడా తీయాలి. - క్షేత్రస్థాయి కార్యకలాపాలను డాక్యుమెంటేషన్ చేసి ప్రజాప్రతినిధులకు ప్రతిరోజూ అందించాలి. - ఇంజరింగ్ విభాగాలకు సంబంధించిన ఆస్తులన్నింటినీ పరిరక్షించాలి. - పనులకు సంబంధించిన టెండర్ అగ్రిమెంట్ల విషయమై పంచాయతీ కార్యదర్శితో సంప్రదింపులు జరపాలి. బిల్లుల రూపకల్పన, క్వాలిటీ కంట్రోల్ నివేదికలను రూపొందించాలి. - స్వచ్ఛ ఆంధ్రాతో పాటు ఇతర కార్యకలాపాలకు హాజరు కావాలి. వర్షాకాలంలో ట్యాంకులు, రహదారులకు గండ్లు పడితే యుద్ధప్రాతిపదికన పనులు చేయించి మంచినీటి సరఫరాకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి - వేసవిలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాను పర్యవేక్షించాలి. - రహదారులు, భవనాలు, స్కూల్స్ నిర్వహణ పనులను పర్యవేక్షించాలి. ప్రభుత్వ భవనాలు, స్కూలు భవనాలను తనిఖీ చేస్తూ తరచూ ఫిట్నెస్ సర్టిఫికెట్లను సమర్పించాలి. -
భక్తులకు అన్నప్రసాద వితరణ
తిరుమల కల్చరల్, న్యూస్‌లైన్: తిరుమలలో శనివారం భక్తులకు టీటీడీ అధికారులు క్యూల వద్దనే అన్నప్రసాదాలను వితరణ చేశారు. పెరటాసి నెల (తిరుమల నెల) రెండవ శనివారం కావడం తో వేకువజాము నుంచి రాత్రి వరకు భక్తులు కాలినడకన తిరుమలకు వేలసంఖ్యలో చేరుకున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తులతో నిండిపోయాయి. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలలో కిలోమీటర్ల మేర బారులుతీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ ఉన్నతాధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ డెప్యూటీఈవో చిన్నంగారి రమణ వివిధ విభాగాల అధికారులతో కలిసి క్యూలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద వితరణ, తాగునీటి పంపిణీ తీరును పరిశీలించారు. క్యూల వద్దకు వెళ్లి ఎమైనా ఇబ్బందులు ఉన్నాయా, సమయానికి అన్నప్రసాదాలు లభిస్తున్నాయా అనే విషయాలపై ఆరా తీశారు. కేవలం పెరుగన్నం, సాంబరన్నమే కాకుండా, పులిహోర, పాలు కూడా క్యూలైన్లోని భక్తులకు అందజేయాలని అన్నదానం అధికారులను ఆదేశించారు. కొంత సమ యం ఆయన స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. వివిధ దర్శన సమయూలను మైక్‌సెట్ ద్వారా ప్రకటనలు చేరుుంచారు. రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం ఒంటి గంటకే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూను నిలిపివేసి సామాన్య భక్తులకే ప్రధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందులో హెల్త్‌ఆఫీసర్ వెంకటరమణ, అన్నదానం క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. -
రూ.2.06 కోట్లకు ‘టెండ ర్’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయిన సంగారెడ్డిలో ఇటీవల ముగిసిన టెండర్ల ప్రక్రియపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.2.06 కోట్ల విలువ చేసే పది పనులకు నేడో రేపో ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధమైంది. పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, కార్యాలయ నిర్వహణ, వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ బాధ్యతల నిర్వహణ వంటి 10 రకాల పనులకు మున్సిపల్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 23న నోటిఫికేషన్ విడుదల చేయగా, ఈ నెల 3 వరకు టెండరు షెడ్యూళ్లు స్వీకరించారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు మున్సిపల్ కమిషనర్ సమక్షంలో టెండరు షెడ్యూళ్లు తెరిచారు. మొత్తం 10 పనులకు ఎనిమిది మంది టెండరు షెడ్యూళ్లు దాఖలు చేశారు. ఒక్కో పనికి అంచనాలకు మించి 4.50 నుంచి గరిష్టంగా 10 శాతం వరకు కాంట్రాక్టర్లు టెండర్ కోట్ చేశారు. 4.5 శాతం నుంచి 4.99 శాతం మేర అదనపు మొత్తానికి పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు వ్యూహం పన్నినట్లు టెండర్ షెడ్యూళ్లను పరిశీలిస్తే అర్థమవుతోంది. పారిశుద్ధ్య నిర్వహణలో 100 మంది కాంట్రాక్టు లేబర్ సరఫరాకు సంబంధించిన పనిలో ఓ కాంట్రాక్టర్ అంచనా మొత్తానికి 4.9 శాతం అదనంగా కోట్ చేశాడు. ఇదే కాంట్రాక్టర్ నీటి సరఫరా విభాగంలో 50 మంది కార్మికుల సరఫరాకు 9 శాతం అదనంగా కోట్ చేయడం ఆరోపణలకు ఊతమిస్తోంది. ఇదే రీతిలో ఇతర కాంట్రాక్టర్లు కూడా అంతర్గత అవగాహన మేరకు పనులు దక్కించుకునేందుకు అవగాహనకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. అంచనా మొత్తానికి 5 శాతానికి మించి కోట్ చేస్తే పనులు దక్కవనే ఉద్దేశంతో 4.99 శాతం మించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తేలింది. మున్సిపాలిటీ వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్న నేతల కనుసన్నల్లోనే టెండర్లు దాఖలైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. పది మంది టెండర్లు దాఖలు చేయగా ఆరుగురు పనులు దక్కించుకున్నారు. ఇందులో పనులన్నీ కీలక నేతలకు సన్నిహితంగా ఉండే ముగ్గురికే దక్కడం గమనార్హం. టెండర్ షెడ్యూళ్ల వివరాల జాబితా సిద్ధం చేశారు. జాబితా ఆమోదించేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, జాయింట్ కలెక్టర్ శరత్ పరిశీలనకు పంపారు. ‘టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్ అయినట్లుగా ఫిర్యాదు అందితే పరిశీ లించి చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు అనుగుణంగా వున్న టెండర్లను మాత్రమే ఆమోదిస్తారని’ సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. -
సర్పంచులకు ‘చెక్’... పవర్ ఎప్పటికో !
మచిలీపట్నం/కైకలూరు, న్యూస్‌లైన్ :పంచాయతీ సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇప్పట్లో వచ్చే సూచనలు కానరావడం లేదు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను ప్రతిచోటా నిధులు లేమి వెక్కిరిస్తూనే ఉంది. దీంతో వర్షాకాలంలో గ్రామాల్లో కనీస పారిశుధ్య పనులు, తాగునీటి పంపిణీ తదితర పనులకు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేని దుస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో ఈ అంశంపైనా సర్పంచులు గుర్రుగానే ఉన్నారు. అయితే ఈ ఉత్తర్వులు ఇంకా పంచాయతీలకు అందలేదు. ప్రభుత్వం నుంచి జారీ అయిన ఉత్తర్వులు కలెక్టర్‌కు, అక్కడి నుంచి డీపీవో, డీపీవో నుంచి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. సమైక్యాంధ్ర సమ్మెలో అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొంటుండటంతో ఈ ఉత్తర్వులు ఇప్పట్లో అమలయ్యే అవకాశాలు లేవని ఉద్యోగులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర సమ్మె ముగిసిన అనంతరమే ఈ ఉత్తర్వులు పంచాయతీలకు చేరే అవకాశం ఉంది. పాత బకాయిలు విడుదలయ్యేనా... రెండేళ్ల విరామం అనంతరం పంచాయతీలకు నూతన పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. రెండేళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలనలోనే పంచాయతీలు కొనసాగాయి. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రత్యేకాధికారి, సంబంధిత పంచాయతీ కార్యదర్శికి సంయుక్తంగా చెక్ పవర్ ఉండేది. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదు. జిల్లాలోని 969 పంచాయతీలకు దాదాపు రూ. 100 కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. ఈ నిధుల విడుదలపై స్పష్టమైన హామీ ఇచ్చేవారే కరువయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రూపాయి మారక విలువ పడిపోవటం తదితర అంశాలన్నీ పంచాయతీలకు పాత బకాయిలు విడుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జాయింట్ చెక్‌పవర్‌పై ఆగ్రహం ... నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం సోమవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై సర్పంచులు ఆగ్రహంగా ఉన్నారు. తమ అధికారాలకు ప్రభుత్వ వైఖరి కత్తెర పెట్టేలా ఉందని వారు వాపోతున్నారు. పంచాయతీలు ఏర్పడిన కొత్తలో సర్పంచులకు కాకుండా పంచాయతీల్లోని ఎగ్జిక్యూటివ్ అధికారులకు చెక్ పవర్ ఉండేది. పంచాయతీల్లో కావాల్సిన పనులను పాలకవర్గం తీర్మానం చేసి అందుకయ్యే ఖర్చును అంచనా రూపొందిస్తే ఈవో సంతకం చేసేవారు. నిధుల దుర్వినియోగమైతే చెక్‌పై సంతకం చేసిన ఈవో నుంచే రికవరీ చేసే వెసులుబాటు అప్పట్లో ఉండేది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సర్పంచులకు చెక్ పవర్ అధికారం ఇచ్చారు. ఇదే అదనుగా భావించిన కొంత మంది సర్పంచులు నిధులను ఇష్టారాజ్యంగా వాడుకున్న దాఖలాలున్నాయి. దుర్వినియోగమైన నిధుల రికవరీకి ఆస్కారం లేకుండా పోయింది. కరెంటు బిల్లులు కట్టేదెలా... వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనర్, మేజర్ పంచాయతీల్లో కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లించేది. ఆయన మరణానంతరం కరెంటు బిల్లులను పంచాయతీలే చెల్లించాల్సి వస్తోంది. కరెంటు బిల్లులు కట్టకుంటే వీధిలైట్లకు విద్యుత్ సర ఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖాధికారులు హుకుం జారీ చేస్తున్నారు. ఒక్కొక్క మేజర్ పంచాయతీలో నెలకు లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. పంచాయతీలకు నూతన పాలకవర్గాలు ఏర్పడడంతో కరెంటు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. చెక్‌పవర్ లేకుండా కరెంటు బిల్లులు ఎలా చెల్లిస్తారనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ పరిణామాల మధ్య పంచాయతీల్లో పాలనా ఎలా సాగుతుందనే అంశంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.