
ఈ-మెయిల్ పాలసీకి ఆమోదం
హైదరాబాద్:ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ-మెయిల్స్ ద్వారానే జరుగనున్నాయి. ఈమేరకు శనివారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. ఇప్పటివరకూ లేఖల ద్వారా రాత పూర్వకంగా జరిగిన ప్రభుత్వ నిర్ణయాలు.. ఈ-మెయిల్ ద్వారా చేపట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం ద్వారా నిర్వహించే అధికారుల ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ-మెయిల్స్ ద్వారా చేపట్టాడానికి కేబినెట్ సుముఖత వ్యక్తం చేసింది.
కాగా, గృహ నిర్మాణాల అవినీతిపై సభాసంఘం వేయాలని కేబినెట్ నిర్ణయించింది. సగంలో నిలిచిపోయిన గృహాలను చేపట్టడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్ కార్డులు లింక్ చేయాలని.. ఒకవేళ ఆధార్ లేకపోతే ప్రత్యామ్నాయ కార్డులను పరిగణలోనికి తీసుకోవాలని నిర్ణయించారు. గృహ నిర్మాణాల అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని కేబినెట్ నిర్ణయింది. అందులో సుమారు రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చింది. కాగా, కేబినెట్ రాజీవ్ స్వగృహ ఇళ్లపై నిర్ణయాన్ని మాత్రం కేబినెట్ వాయిదా వేసింది.