సోనియాను కలిసిన ఏపీ రాజధాని రైతులు | ap capital farmers meet sonia gandhi | Sakshi
Sakshi News home page

సోనియాను కలిసిన ఏపీ రాజధాని రైతులు

Published Sun, Apr 19 2015 7:02 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

ap capital farmers meet sonia gandhi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తమ భూములు బలవంతంగా లాక్కుంటున్నారని గుంటూరు జిల్లాకు చెందిన రైతులు... కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మొరపెట్టుకున్నారు. ఉండవల్లి, పెనమాక గ్రామాలకు చెందిన రైతులు ఆదివారం ఢిల్లీలో సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీని కలిశారు.

తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అన్నదాతలు వివరించారు. ఈ సమస్యపై మరోసారి ప్రత్యేకంగా సమావేశమవుదామని సోనియా, రాహుల్ చెప్పారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు నేతృత్వంలో రైతులు ఢిల్లీకి పయనమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement