హైదరాబాద్ : ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం పిటిషన్ను పరిగణనలోకి తీసుకుని, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. కాగా ల్యాండ్ ఫూలింగ్ నుంచి తమను విముక్తి చేయాలంటూ ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాలకు చెందిన 32మంది రైతులు కోర్టులో పిటిషన్ వేశారు. క్లాస్ 22 సెక్షన్ 2(52) ఆఫ్ సీఆర్‌డీఏ చట్టం ప్రకారం స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే తీసుకోవాలని.. బలవంతంగా భూములు లాక్కొనే పరిస్థితి సర్కార్ తెచ్చిందని రైతులు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే ఏపీ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్కు తాము వ్యతిరేకమంటూ ఇప్పటికే సీఆర్డీఏకు అభ్యంతర ఫారాలు (9.2) రైతులు ఇచ్చారు. ఆ అభ్యంతర ఫారాలు ఇచ్చిన 15 రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉన్నా...ఇప్పటికీ సర్కార్ స్పందించలేదు. 9.2 ఫారాలు ఇచ్చిన రైతులకు ల్యాండ్ పూలింగ్తో సంబంధం లేదంటూ సీఆర్డీఏ నిబంధనల్లో ఏపీ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే అభ్యంతర ఫారాలు ఇచ్చి నెల గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సమాధానం లేకపోవటంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
ల్యాండ్ పూలింగ్పై హైకోర్టును ఆశ్రయించిన రైతులు
Published Fri, Feb 20 2015 12:40 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement