ఏపీ సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్‌ను ఓపీ సెక్షన్ నుంచి ప్రొటోకాల్ సెక్షన్‌కు మార్పు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం కోరినట్లుగా సలహాదారుల పేషీలకు సిబ్బంది కేటాయింపులు, వాహనాల అద్దెల చెల్లింపు, ఫర్నిచర్ కొనుగోలుకు అనుమతులు ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పి న సిబ్బందిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సీఎం కార్యాలయం పంపించిన ప్రతి పాదనలను యథాతథంగా అంగీకరించడానికి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ఫైళ్ల మీద రాస్తున్న ఇద్దరు అధికారులను సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ఓపీ సెక్షన్ల నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆ తర్వాత కూడా.. ప్రభుత్వ సలహాదారులకు పెద్ద ఎత్తున ఫర్నిచర్ కొనుగోలు చేయడానికి, పేషీల్లో సిబ్బందిని నియమించడానికి సంబంధించిన ఫైల్ మీద సంతకాలు చేయడానికి మిగతా అధికారులూ నిరాకరించడంతో వారిని కూడా ఓపీ సెక్షన్ల నుంచి ప్రొటోకాల్ సెక్షన్‌కు బదిలీ చేస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు (ఒ.ఒ. ఎంఎస్ 16) జారీ చేసింది.
ముఖ్యమంత్రి, ఆయన కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలకు ఖరీదైన ఫర్నిచర్ కొనుగోలుకు, నామినేషన్ మీద లక్షలాది రూపాయల సివిల్, ఎలక్ట్రికల్ పనులు అప్పగించడానికి అధికారులు నిరాకరించటంతో వారిని ఎస్‌బీ నుంచి పొలిటికల్ ఎ సెక్షన్‌కు మార్చారు.
స్టేషనరీ, నాన్-స్టేషనరీ, క్సిరాక్స్ మిషన్లు, సెల్‌ఫోన్ల కొనుగోళ్లు, టెలిఫోన్ బిల్లుల చెల్లింపును ఓపీ-3 సెక్షన్ నుంచి పొలిటికల్-ఎ సెక్షన్‌కు మార్చారు.
వాహనాల అద్దెలు, న్యూస్ పేపర్ బిల్లుల చెల్లింపును ఓపీ-2 సెక్షన్ నుంచి పొలిటికల్-ఎ సెక్షన్‌కు అప్పగించారు.
బాబు ఆఫీసుకు రూల్స్ అడ్డొస్తే...
Published Mon, Oct 27 2014 1:02 AM | Last Updated on Sat, Jul 28 2018 4:52 PM
Advertisement
Advertisement