Department of General Administration
-
పనిష్మెంట్లో ఉన్నవారి వివరాలివ్వండి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అవినీతిపరులైన ఉద్యోగుల గుండెల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గుబులు రేపుతోంది. తాజాగా రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఇటీవల రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో పనిష్మెంట్(శాఖాపరమైన చర్యలు)లో ఉన్నవారు, పనిష్మెంట్ అమలుకాకుండా పెండింగ్‌లో ఉన్నవారి వివరాలను కోరుతూ ఆయన లేఖ రాశారు. దీంతో ఏసీబీ కోరిన వివరాలివ్వాలంటూ అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు, హెచ్ఓడీలకు జీఏడీ ఉత్తర్వులు(మెమో) జారీ చేసింది. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఏసీబీ దాడులు ముమ్మరం చేయడం తెలిసిందే. అవినీతికి సంబంధించిన సమాచారం, ఫిర్యాదులకోసం ప్రభుత్వం డయల్ 14400 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. టోల్ ఫ్రీ నంబర్‌కు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు తమ టీమ్‌తో దాడులు నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజుల్లో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ హాస్టల్స్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుపుదాడులు జరిపి.. సోదాలు నిర్వహించి లోపాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. దీంతో అవినీతి వేళ్లూనుకున్న కొన్ని శాఖల్లోని ఉద్యోగులు తర్వాత వంతు తమదేమోననే భయంతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో జీఏడీకి ఏసీబీ డీజీ రాసిన లేఖ ప్రభుత్వ శాఖల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. అవినీతిపరుల జాబితాకోసం ఏసీబీ దృష్టి పెట్టిందనే ప్రచారం జరగడంతో పలువురు ఉద్యోగుల్లో కంగారు మొదలైంది. మేం అడిగింది పనిష్మెంట్కు గురైన వారి వివరాలు మాత్రమే ప్రభుత్వ శాఖల్లో అవినీతిపరులైన అధికారుల వివరాలు కోరినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు. అవినీతికి పాల్పడేవారిని ఏసీబీ గుర్తిస్తుంది. అంతేతప్ప ప్రభుత్వ శాఖలను ఆ వివరాలు ఎందుకు అడుగుతాం.. సస్పెండైన ఉద్యోగులు, పనిష్మెంట్ అమలు కాకుండా పెండింగ్‌లో ఉన్నవారి వివరాలు మాత్రమే మేం కోరాం. 2019 జూన్ 1 తేదీ నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయి వివరాలను ఇవ్వాలని జీఏడీని కోరడం జరిగింది. – ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు -
బాబు ఆఫీసుకు రూల్స్ అడ్డొస్తే...
ఏపీ సీఎం ఎస్టాబ్లిష్మెంట్ను ఓపీ సెక్షన్ నుంచి ప్రొటోకాల్ సెక్షన్‌కు మార్పు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం కోరినట్లుగా సలహాదారుల పేషీలకు సిబ్బంది కేటాయింపులు, వాహనాల అద్దెల చెల్లింపు, ఫర్నిచర్ కొనుగోలుకు అనుమతులు ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పి న సిబ్బందిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సీఎం కార్యాలయం పంపించిన ప్రతి పాదనలను యథాతథంగా అంగీకరించడానికి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ఫైళ్ల మీద రాస్తున్న ఇద్దరు అధికారులను సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ఓపీ సెక్షన్ల నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత కూడా.. ప్రభుత్వ సలహాదారులకు పెద్ద ఎత్తున ఫర్నిచర్ కొనుగోలు చేయడానికి, పేషీల్లో సిబ్బందిని నియమించడానికి సంబంధించిన ఫైల్ మీద సంతకాలు చేయడానికి మిగతా అధికారులూ నిరాకరించడంతో వారిని కూడా ఓపీ సెక్షన్ల నుంచి ప్రొటోకాల్ సెక్షన్‌కు బదిలీ చేస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు (ఒ.ఒ. ఎంఎస్ 16) జారీ చేసింది. ముఖ్యమంత్రి, ఆయన కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలకు ఖరీదైన ఫర్నిచర్ కొనుగోలుకు, నామినేషన్ మీద లక్షలాది రూపాయల సివిల్, ఎలక్ట్రికల్ పనులు అప్పగించడానికి అధికారులు నిరాకరించటంతో వారిని ఎస్బీ నుంచి పొలిటికల్ ఎ సెక్షన్‌కు మార్చారు. స్టేషనరీ, నాన్-స్టేషనరీ, క్సిరాక్స్ మిషన్లు, సెల్ఫోన్ల కొనుగోళ్లు, టెలిఫోన్ బిల్లుల చెల్లింపును ఓపీ-3 సెక్షన్ నుంచి పొలిటికల్-ఎ సెక్షన్‌కు మార్చారు. వాహనాల అద్దెలు, న్యూస్ పేపర్ బిల్లుల చెల్లింపును ఓపీ-2 సెక్షన్ నుంచి పొలిటికల్-ఎ సెక్షన్‌కు అప్పగించారు. -
‘సమాచార’ బాధ్యతలు రమణారెడ్డికి
దానకిషోర్ బీసీ సంక్షేమ శాఖకు బదిలీ మీడియా లైజనింగ్ ఆఫీసర్ల ఫైలు పెండింగే బదిలీకి కారణం! దానకిషోర్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కేంద్రం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్ బాధ్యతలను ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న ఎన్.వి.రమాణారెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం.దానకిషోర్‌ను బీసీ సంక్షేమశాఖకు బదిలీ చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వాణీప్రసాద్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి దానకిషోర్‌కు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దానకిషోర్ బదిలీకి ప్రధాన కారణం విధులకు సరిగా హాజరు కాకపోవడంతో పాటు లోకేశ్‌బాబు సూచించిన వ్యక్తులను మీడియా లైజనింగ్ ఆఫీసర్లగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయకపోవడమేనని చెప్తున్నారు. ఉన్నతాధికారుల పంపిణీలో భాగంగా దానకిషోర్‌ను కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. అప్పటి నుంచి ఆయన ఏపీ సమాచార శాఖ కమిషనర్ బాధ్యతలను సరిగా నిర్వహించడం లేదని చెప్తున్నారు. ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా కలిసినట్లు ప్రచారం సాగుతోంది.తెలంగాణకు వెళ్లే ముందు ఏపీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదనే భావనలో దానకిషోర్ ఉన్నారని.. అందువల్లనే మీడియా లైజనింగ్ ఆఫీసర్ల నియామక ఫైలును పెండింగ్‌లో ఉంచారని చెప్తున్నారు. ఇక ఐఆర్పీఎస్ సర్వీసుకు చెందిన రమణారెడ్డి ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (ప్రోటోకాల్) ప్రత్యేక కార్యదర్శిగా సమర్ధంగా పనిచేస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే రమాణారెడ్డికి సమాచార శాఖ కమిషనర్‌గా, ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.