కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేస్తున్నారు | AP clears a massive loan reschedule, waiver scheme | Sakshi
Sakshi News home page

కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేస్తున్నారు

Published Fri, Jul 25 2014 2:07 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేస్తున్నారు - Sakshi

కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేస్తున్నారు

 కన్విన్స్ చేయలేక చంద్రబాబు అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి  అసెంబ్లీలో చేసిన ఆరోపణలు ఇప్పుడు అక్షర సత్యమవుతున్నాయి. రుణాల రీ షెడ్యూల్ లేదు, రుణ మాఫీ అంతకన్నా జరగలేదు. కనీసం బ్యాంకర్లకు సమాచారం అందజేయలేదు. అయితే అప్పుడే రుణమాఫీ జరిగిపోయినట్టు, రైతులు లబ్ధిపొందేసినట్టు, లాభసాటి వ్యవసాయం చేసేస్తున్నట్టు డప్పుకొట్టించుకుంటూ తనపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. దీంతో పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు అన్నదాత పరిస్థితి తయారయింది. అసలేం జరుగుతోందో అర్థం కాక రైతులు అయోమయంలో పడ్డారు. మానసికంగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘ఆలూ లేదు... చూలూ లేదు. కొడుకుపేరు సోమలింగం’ అన్నట్టుగా ఉంది టీడీపీ నేతల పరిస్థితి. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటిం చగా అదేదో అమలైపోయినట్టు, రైతులకు మాఫీ జరిగిపోయినట్టు సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రైతులను మరింత గందరగోళంలో పడేస్తోంది. చంద్రబాబు ప్రకటనలు చేయడం తప్ప ఎక్కడా కార్యరూపం దాల్చడం లేదు. మాఫీ ఎక్కడా జరగలేదు. రుణాల రీషెడ్యూల్  అంతకన్నా లేదు. కనీసం మార్గదర్శకాలు రాలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవడంతో కొత్త రుణాలు లభిం చక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు చంద్రబాబు ఇచ్చిన హామీతో పాత బకాయిలు చెల్లించకపోవడంతో డిఫాల్టరై 11.07శాతం నుంచి 11.3శాతం మేర వడ్డీ భారాన్ని మోయాల్సిన దుస్థితి ఏర్పడింది.  
 
 రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతు త్రిశంకు స్వర్గంలో పడ్డాడు. పాలకుల మోసపూరిత హామీలకు రైతన్నకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. పంటరుణాలు పూర్తిగా మాఫీ చేస్తున్నామని, బాకీలు చెల్లించవద్దని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు మాటలు నమ్మి కష్టాలు కొని తెచ్చుకున్నారు. రెండు నెలలు పాలన తరువాత ఒక్కొక్క కుటుంబానికి రూ.1.50 లక్షలలోపు మాత్రమే రుణమాఫీ అంటూ చేతులెత్తేశారు. ఒక కుటుంబమానికి అంటూ పెట్టిన మెలిక పలు అనుమానాలకు తావిస్తోంది. రుణ మాఫీ అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలంటూ ఇంతవరకు అటు అధికారులకు గానీ, ఇటు బ్యాంకులకు గానీ ఆదేశాలు రాలేదు. రుణాలు రీషెడ్యూల్ చేయాలని కూడా ఆదేశించలేదు. దీంతో రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నా డు. మరోవైపు పంట రుణానికి వచ్చే వడ్డీ రాయితీ గడువు దాటిపోతోంది. రిజర్వుబ్యాంకు, ఎస్‌ఎల్‌బీసీ (స్టేల్ లెవిల్‌బ్యాంకర్ల కమిటీ) నిబంధనల మేరకు... తీ సుకున్న పంటరుణాన్ని ఏడాదిలోపు చెల్లించిన వారికే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వడ్డీరాయితీ పథకం(ఏడు శా తం వడ్డీ) వర్తిస్తుంది.
 
 అయితే, గడువు మీరిన బకాయి పై కచ్చితంగా 11.07శాతం నుంచి 11.3శాతం వడ్డీ (బ్యాంకును బట్టి) చెల్లించాల్సిందే. రుణం తీసుకున్న నాటి నుంచి ఇదే వడ్డీ లెక్కను బ్యాంకర్లు వర్తింపచేయనున్నారు. చంద్రబాబునాయుడు మాటలు నమ్మి రైతు లు బకాయిలు  చెల్లించలేదు. కొత్త ప్రభుత్వ పాత రు ణాలను మాఫీ చేసి కొత్తగా ఖరీఫ్ రుణాలిస్తుందని ఆ శించిన రైతుకు భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. కిందటి ఆర్థికసంవత్సరంలో పంటరుణాలకింద బ్యాం కుల నుంచి తీసుకున్న వాటి చెల్లింపులు ఒక్కొక్క రైతు కు ఒక్కొక్క తేదీ ఉన్నప్పటకీ దాదాపుగా జూన్ 30వ తేదీతో అధిక రైతులకు గడువు తీరింది. అంటే జూలై ఒ కటో తేదీ నుంచి ప్రతిరైతుపై  వడ్డీ భారం పడుతుంది.
 
 మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేకుండానే బ్యాంకర్లు చర్యలు మొదలు పెట్టారు. గడు వు మీరిన బకాయిదారులకు నోటీసులు జారీ చేస్తున్నా రు. ఈనేపథ్యంలో జిల్లా రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలయింది. జిల్లా వ్యాప్తంగా 4.40లక్షల మంది రైతులుండగా.. ఇందులో రెండు లక్షలమంది వరకూ వివిధ పథకాల సాగుకోసం రుణాలు తీసుకున్నారు. వివిధ జాతీయ, గ్రామీణ, సహకార బ్యాంకుల్లో దీర్ఘ కాలిక, స్వల్పకాలిక పంట రుణాలు, బంగారు ఆభరణాలు తనఖాపెట్టి రుణాలు పొందారు. 2014 మార్చి లోపు రూ.2083 కోట్లు పంపిణీ అయ్యాయి.
 
 పంట రుణాలకు రూ.763 కోట్లు, బంగారు తనఖా రుణాలు రూ.628 కోట్లు, టెర్మ్ రుణాలు రూ.301 కోట్లు, పొదుపు సంఘాలకు రూ.391 కోట్లు రుణాలిచ్చారు. ఒక్క 2013-14 ఆర్థిక సం వత్సరంలో రూ.1,548 కోట్లు రుణాలు ఇచ్చినట్లు నివేదిక లు చెపుతున్నాయి. ఇందులో పంట రుణాలకు రూ.725 కోట్లు, బంగారు తనఖాపై రూ.432కోట్లు, మహిళా స్వ యం సహాయక సంఘాలకు రూ.391కోట్లు పంపిణీ చేశా రు. ఈమొత్తమంతా మాఫీ అవుతుందని అటురైతులు, తమ రుణం కూడా మాఫీ అవుతుందని డ్వాక్రామహిళ లు ఆశించారు.కానీ చంద్రబాబు రోజుకొక ప్రకటన చే స్తుండడంతోరైతులుఅయోమయానికిగురవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement