
సంక్రాంతి సరుకుల్లో గోల్ మాల్.. విచారణ
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సరుకుల టెండర్లలో అవకతవకలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సరుకుల గోల్మాల్పై ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించింది. సీఎంఓ ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర నేతృత్వంలో ఈ విచారణ కొనసాగాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. టెండర్ల వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను, కమిషనర్ను కూడా సీఎంఓ అధికారులు వివరణ కోరారు.
ఆరోపణలు వచ్చినా.. పౌరసరఫరాల శాఖ మాత్రం టెండర్లపై పునః పరిశీలన మాత్రం చేయలేదు. కేంద్రీయ భండార్, బాలాజీ ఆయిల్ మిల్స్ సంస్థలకే పౌరసరఫరాల శాఖ అధికారులు టెండర్లను ఖరారు చేశారు. అయితే.. తమకు సొంతంగా సరుకులు సరఫరా చేసే సామర్థ్యం లేకపోవడంతో కేంద్రీయ భండార్ ఇతర సంస్థలకు ఆర్డర్లు ఇచ్చింది.