tenders issue
-
‘టెండర్ల’కు చెమటలు
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల ప్రక్షాళనకు కొత్త ప్రభుత్వం మొగ్గుచూపడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖలో అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. బంధుప్రీతితో జరిగిన టెండర్ల కేటాయింపుపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. పాతిక శాతం దాటని పనులకు సంబంధించి టెండర్లను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. జలవనరుల శాఖలో గత ప్రభుత్వ హయాంలో అనుమతించిన టెండర్లను అధికారులు సమీక్షిస్తున్నారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన కాంట్రాక్టులను రద్దు చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో గతంలో కేటాయించిన పనులపై సమీక్షించి నత్తనడకన సాగుతున్న పనులను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నారు. రూ.45 కోట్ల జైకా నిధులతో మున్నేరు అభివృద్ధి.. గత ఏడాది జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ), వరల్డ్ బ్యాంకుల నుంచి వచ్చిన నిధులతో చెరువులు, కాలువల మరమ్మతులు చేపట్టారు. జైకా నుంచి వచ్చిన రూ.45 కోట్ల నిధులతో మున్నేరు మెయిన్ కెనాల్ అభివృద్ధి పనులు, చెరువుల అభివృద్ధి చేపట్టారు. 50 కిలోమీటర్ల పొడవు మున్నేరు కాలువ గట్ల బలోపేతం, ధ్వంసమైన బ్రిడ్జిలను తిరిగి నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్యాకేజ్–1లో ఐదు చెరువులు, ప్యాకేజ్–2లో ఏడు చెరువుల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. వాస్తవంగా ఆన్లైన్ ద్వారా టెండర్లు దాఖలు చేసినప్పటికీ నాటి అధికార పార్టీ నేతలకు చెందిన కాంట్రాక్టర్లకే ఈ పనులు దక్కాయి. మున్నేరు ప్రధాన కాలువ పనులు 20 శాతం పూర్తికాగా.. ప్యాకేజ్ 1, 2లలో పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తూ ఒక నివేదికను సిద్ధం చేశారు. వరల్డ్ బ్యాంకు నిధులతో చెరువుల అభివృద్ధి.. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన సుమారు రూ.100 కోట్లతో పశ్చిమ కృష్ణాలోని 78 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టారు. వరల్డ్ బ్యాంకు నిబంధనల ప్రకారం బాక్స్ టెండర్లు మాత్రమే వేయాల్సి ఉంది. ఇది తెలుగుదేశం నేతలకు వరంగా మారింది. జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులకు తప్ప బయట కాంట్రాక్టర్లకు కనీసం టెండర్ ఫారాలు కూడా దక్కకుండా జాగ్రత్త పడ్డారు. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన నిధులతో రెడ్డిగూడెంలో 9 చెరువులు, గన్నవరంలో మూడు చెరువులు, మైలవరంలో నాలుగు చెరువులు, బాపులపాడులో 10 చెరువులు, ముసునూరులో 7 చెరువులు, చాట్రాయిలో 8 చెరువులు, విసన్నపేటలో 11 చెరువులు, నూజివీడులో 8 చెరువులు, తిరువూరులో 3 చెరువులు, విజయవాడ రూరల్‌లో ఒక చెరువు, కోడూరులో 4 చెరువులు, ఆగిరిపల్లిలో రెండు, ఏకొండూరు, గంపలగూడెంలో 4 చెరువులకు గట్ల బలోపేతం చేసి, పూడికలు తీసి చెరువుల ద్వారా సాగునీటి వసతికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఐదు శాతం అధిక ధరలకు.. తొలుత టెండర్ల ధరలపై 25 శాతం అధిక రేట్లకు టెండర్లు వేశారు. అయితే దీనిపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసి రద్దు చేశారు. దీంతో టెండర్ రేటుపై ఐదు శాతం అధికంగా టెండర్లు దాఖలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ టెండర్లను మంత్రి అనుచరులే దక్కించుకోగా.. 17 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అందులో ఆరు చెరువులకు పనులు ప్రారంభంకాకపోగా, 11 చెరువులకు సంబంధించి 20 శాతంలోపు పనులు జరిగాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలుగు తమ్ముళ్లు పనులు విషయంలో వెనుక్కు తగ్గారు. ప్రస్తుతం ఈ పనుల ప్రస్తుత స్థితిని వివరిస్తూ కమిషనర్ కార్యాలయానికి లేఖ రాస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ టెండర్లు రద్దయితేనే మంచిదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. -
13న ‘భోగాపురం’ సినిమా
సాక్షి, అమరావతి: ఎన్నికల ముంగిట మరో శంకుస్థాపన సినిమాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నద్ధమయ్యారు. భూ సేకరణ పూర్తి కాకుండా, ప్రాజెక్టు ఎవరు నిర్మిస్తారో తెలియకుండానే భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఈ నెల 13వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ ఫిబ్రవరి 22తో ముగిసిన తర్వాత మార్చి మొదటి వారంలో శంకుస్థాపన తలపెడితే, ఎన్నికల కోడ్ వచ్చేస్తుందన్న భయంతో ఫిబ్రవరి 13న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి ఆదేశాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. భూ సేకరణ, టెండర్లు వంటి కీలక పనులు కూడా కాకుండా కేవలం ఎన్నికల ప్ర,చారం కోసమే శంకుస్థాపన చేస్తుండడం గమనార్హం. టెండర్ల ప్రక్రియపై నీలినీడలు భోగాపురంలో సుమారు రూ.4,208 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించాలని 2015లో ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 2,700 ఎకరాల భూమి అవసరమని అంచనా వేయగా, అందులో ఇంకా 300 ఎకరాలను సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 2016లో టెండర్లు పిలవగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా దక్కించుకుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్లను రద్దు చేసి మెయింటినెన్స్, ఓవర్ ఆయిలింగ్(ఎంఆర్వో)తో కలిపి టెండర్లను పిలిచింది. తాజా టెండర్లలో ఎయిర్‌పోర్టు నిర్మించడానికి ఏడు సంస్థలు ఆసక్తి చూపించగా, ఈ సంస్థలు ఎంత ఆదాయం ఇస్తాయో తెలపాలంటూ ఫిబ్రవరి 22 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. కానీ, ఇదే సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్టు మొదలైన తర్వాత కూడా వైజాగ్ ఎయిర్‌పోర్టును కొనసాగిస్తామని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పడంతో ఈ టెండర్ల ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 22న ఎంతమంది టెండర్లలో పాల్గొంటారనేది ప్రశ్నార్థకరంగా మారింది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా, ముందుగానే గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ పేరుతో కొబ్బరికాయ కొట్టి మరో శిలాఫలకం వేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఇప్పటికే కడప ఉక్కు, రామాయపట్నం పోర్టులకు ఇదే విధంగా శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. -
మెస్ బిల్.. గుండె గుబేల్!
సాక్షి, కర్నూలు(గాయత్రీ ఎస్టేట్) : రాయలసీమ విశ్వవిద్యాలయం హాస్టళ్లలో ఇష్టారాజ్యంగా మెస్ బిల్లులు వసూలు చేస్తుండడంతో విద్యార్థులు హాస్టల్ పేరు చెబితేనే హడలిపోతున్నారు. హాస్టళ్లలో ప్రొవిజన్స్, కూరగాయలు, చికెన్, పాలు, నీటి సరఫరాకు ఎలాంటి టెండర్లు లేకుండా పర్చేజ్ కమిటీ అనామతుగా బిల్లలు చెల్లిస్తుండడంతో విద్యార్థులకు బిల్లుల భారం పెరుగుతోంది. ఏడాదికి అదనంగా రూ.15 లక్షలు అదనపు భారం పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇప్పటి వరకు హాస్టళ్లకు సంబంధించి ప్రొవిజన్స్, కూరగాయలు, పాలు తదితర వాటికి ఎలాంటి టెండర్లు పిలవలేదు. ప్రస్తుతం మెస్ నిర్వహణ కోసం 15 రోజులకు సరిపడా వస్తువులను కొనుగోలు చేశారు. టెండర్ల ఊసే లేదు.. విశ్వవిద్యాలయంలో మూడు మెన్స్ హాస్టళ్లు, రెండు ఉమెన్స్ హాస్టళ్లున్నాయి. గతేడాది 330 మంది అబ్బాయిలు, 335 మంది అమ్మాయిలు హాస్టళ్లలో ఉన్నారు. నెలకు సరిపడా ప్రొవిజన్స్‌కు రూ.7లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రొవిజన్లకు సంబంధించి 2016 టెండర్లు పిలిచారు. అప్పుడు కూడా ఒక నెలకు మాత్రమే అని నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పుడు ఎవరైతే టెండర్లలో దక్కించుకున్నారో వారినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక కూరగాయలు, పాలు, నీటి సరఫరాకు సంబంధించి వర్సిటీ ఏర్పటి నుంచి అయిన వారికే అప్పగిస్తున్నారు. ఇందులో వర్సిటీ కీలక అధికారులకు పర్సెంటేజీలు అందుతుండటంతో టెండర్లు లేకుండానే హాస్టళ్లను నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. విద్యార్థులపై భారం.. వర్సిటీలోని ఆరు హాస్టళ్లలో 665 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి నెలకు ఒక్కొక్కరికి రూ.2000 నుంచి రూ.2500 వరకు మెస్ బిల్లు వస్తుంది. అయితే స్కాలర్షిప్ కోర్సు, కేటగిరిని బట్టి ఏడాదికి రూ.5400 నుంచి రూ. 7000 వరకు వస్తుంది. మిగతాది విద్యార్థులు చేతి నుంచి చెల్లించాల్సిందే. టెండర్ల ద్వారా ఏజెన్సీలను పిలిచి తక్కువ ధరలకు కోట్ చేసినవారికి బాధ్యతలు అప్పగిస్తే విద్యార్థులపై మెస్ బిల్లుల బారం తగ్గుతుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. నివేదిక ఇవ్వని విచారణ కమిటీ గత విద్యా సంవత్సరం హాస్టళ్ల ప్రొవిజన్స్, కూరగాయల కొనుగోలు తదితర వాటిల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని దానిపై విచారణ చేయించాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. దీంతో వర్సిటీ ఉన్నతాధికారులు ఆర్యూ ఈసీ మెంబర్ ప్రొఫెసర్ సంజీవరావు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ విశ్వనాథ«రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ సుబ్బారెడ్డితో కమిటీ నియమించారు. అయితే ఈ కమిటీ ఇప్పటికీ ఎలాంటి నివేదిక సమర్పించలేదు. త్వరలో టెండర్లు పిలుస్తాం హాస్టల్స్‌కు ప్రొవిజన్స్, కూరగాయలు సరఫరా చేయడానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేస్తాం. ఉన్నవారితోనే మార్కెట్ ధరలకు అనుగుణంగా వస్తువులను సరఫరా చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక్కడి పరిస్థితులకు భయపడి వస్తువులను సరఫరా చేయడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ సారి పర్చేజ్ కమిటీతో పాటు, విద్యార్థుల సమక్షంలోనే టెండర్లు ఓపెన్ చేస్తాం. – ప్రొఫెసర్ అమర్నాథ్, రిజిస్ట్రార్ -
సంక్రాంతి సరుకుల్లో గోల్ మాల్.. విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సరుకుల టెండర్లలో అవకతవకలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సరుకుల గోల్‌మాల్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించింది. సీఎంఓ ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర నేతృత్వంలో ఈ విచారణ కొనసాగాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. టెండర్ల వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను, కమిషనర్‌ను కూడా సీఎంఓ అధికారులు వివరణ కోరారు. ఆరోపణలు వచ్చినా.. పౌరసరఫరాల శాఖ మాత్రం టెండర్లపై పునః పరిశీలన మాత్రం చేయలేదు. కేంద్రీయ భండార్, బాలాజీ ఆయిల్ మిల్స్ సంస్థలకే పౌరసరఫరాల శాఖ అధికారులు టెండర్లను ఖరారు చేశారు. అయితే.. తమకు సొంతంగా సరుకులు సరఫరా చేసే సామర్థ్యం లేకపోవడంతో కేంద్రీయ భండార్ ఇతర సంస్థలకు ఆర్డర్లు ఇచ్చింది.