భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రాంనాథ్ కోవింద్‌కు అభినందనల వెల్లువ కురుస్తోంది.
అమరావతి: భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రాంనాథ్ కోవింద్‌కు అభినందనల వెల్లువ కురుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాంనాథ్ కోవింద్‌కు అభినందనలు తెలిపారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నత పదవిని అలంకరించారని ప్రశంసించారు. తాను మద్దతు ఇచ్చిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం తనకెంతో సంతోషం కలిగించిందన్నారు.
మరోవైపు కోవింద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు లు శుభాకాంక్షలు తెలిపారు. కాగా యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌పై రామ్‌నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. ఈ నెల 25న ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు.