
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం వెనుక సోషల్ మీడియా యోధుల పాత్ర ఎంతో ఉందని, వారందరికీ తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ట్వీట్ చేశారు. ‘నేను రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన ఈ తరుణంలో మా సోషల్ మీడియా యోధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. మీరు వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం ఎంత శ్రమించారో... ఎల్లో మీడియా ప్రచారాన్ని ఎలా తిప్పి కొట్టారో నాకు బాగా తెలుసు. పార్టీ విజయం సాధించడంలో మీరు ఏస్థాయిలో కారకులయ్యారో కూడా నాకు తెలుసు. మీ అందరికీ నేను వినమ్రతతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మీ నుంచి నాకు ఇదే మద్దతు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను’ అని జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment