నూజివీడు (కృష్ణా జిల్లా) : ముసునూరు మహిళా ఎమ్మార్వో వనజాక్షితో అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను టీడీపీ వెంటనే విప్ పదవి నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ అధికారులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా వ్యవహరించాలని రామకృష్ణ కోరారు.