ఉస్మానియా ఆస్పత్రి, దంతవైద్య కళాశాలల్లో తెలంగాణ జేఏసీ వైద్యుల నిర్వాకంపై ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా మండిపడింది. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వైద్యులపై ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ కోరారు. విశాఖపట్నంలో ఆయన ఈ సంఘటనను ఖండిస్తూ విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం నాడు డాక్టర్ శివరామిరెడ్డి సూపరింటెండెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించగా, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, మెడికల్ జేఏసీల ప్రతినిధులు ఆయన చాంబర్‌ను ముట్టడించారు. లోపలికి వెళ్లి శివరామిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ‘మీకన్నా ఎక్కువ సీనియారిటీ ఉన్న డాక్టర్ సువర్ణకు దక్కాల్సిన పోస్టులో ఎలా కొనసాగుతారు’ అంటూ ప్రశ్నించారు. వెంటనే ఉన్నతాధికారులను కలిసి ఉస్మానియా సూపరింటెండెంట్‌గా కొనసాగలేనని చెప్పాలని, లేకుంటే ఇప్పటికిప్పుడే వైద్య సేవలు నిలిపేసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం ఆయనను సూపరింటెండెంట్ కుర్చీ నుంచి తప్పించి సువర్ణను కూర్చొబెట్టి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఉస్మానియా దంత వైద్య కళాశాలలోనూ ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. దీనిపైనే శ్యాం సుందర్ స్పందించారు.
'ఆ వైద్యులపై చర్యలు తీసుకోండి'
Published Tue, Sep 3 2013 1:07 PM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement