నేడు డీఎస్సీ ఫలితాలు | AP DSC 2015 Results Today 5 PM TET cum TRT Results | Sakshi
Sakshi News home page

నేడు డీఎస్సీ ఫలితాలు

Published Tue, Jun 2 2015 4:45 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

AP DSC 2015 Results Today 5 PM TET cum TRT Results

సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2014 (టెట్ కమ్ టీఆర్టీ) పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో సాయంత్రం 5.30 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

డీఎస్సీ ఫైనల్‌కీపై వచ్చిన అభ్యంతరాలను కూడా నిపుణుల బృందంతో పరిశీలింపజేశామని, అనంతరం తప్పులు లేకుండా సవరించిన ఫైనల్ ‘కీ’ని ‘‘HTPP://APDSC.CGG.GOV.IN’’ వెబ్‌సైట్లో పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement