
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రైవేట్ విద్యకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు భూములు కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. అప్పటి సీఎం చంద్రబాబు కార్పొరేట్ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పాలనలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని మండి పడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ నెల 5నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో తరగతులు మొదలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment