సాక్షి, అమరావతి: పారదర్శకంగా కరోనా వైరస్ ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏపీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. కిట్ల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా వృథా కాలేదు. దీంతో టీడీపీ చేసిన తప్పుడు ప్రచారం గుట్టురట్టు అయింది. దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ. 730 చొప్పున లక్ష కిట్లను దిగుమతి చేసుకుంది. అదేవిధంగా రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్ ఆర్డర్‌లో ప్రభుత్వం ప్రత్యేకమైన క్లాజ్ను పెట్టింది. దేశంలో ఎవరకి తక్కువ ధరకి అమ్మితే అదే ధరను చెల్లిస్తామని షరతు కూడా విధించింది.
ఛత్తీస్‌గఢ్‌లో రూ.335కి కొనుగోలు చేసినట్టు ప్రచారం జరగగా.. ఆ అంశంపై కిట్ల సరఫరా కంపెనీకి నోటీసులు పంపించి.. అతి తక్కువ ధరనే చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్చేజ్ ఆర్డర్‌లో షరతు మేరకు చెల్లింపులు చేస్తామని పేర్కొంది. ఇవే కిట్లను రూ. 790కి ఐసీఎంఆర్ కొనుగోలు చేసింది. ఐసీఎంఆర్ అనుమతించిన సంస్థకే ఏపీ ప్రభుత్వం ఆర్డర్ చేసినట్లు డాక్యుమెంట్లు విడుదల చేయడంతో టీడీపీ తప్పుడు ప్రచారం బట్టబయలైంది. పూర్తిగా అవగాహన లేని డాక్యుమెంట్లతో టీడీపీ తప్పుడు ప్రచారం చేసింది. ఈ తప్పడు ప్రచారంపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment