తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థులకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే ఫీజులు చెల్లించనుంది. ఈ మేరకు లేక్వ్యూ గెస్ట్హౌస్లో బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రైతులకు ఆర్థిక సాయం పేరుతో.. రుణాల నుంచి వారికి విముక్తి కల్పించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. తొలివిడతలో సన్న, చిన్నకారు రైతులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు.
రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాయని కేబినెట్ సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. ఇక రేపటినుంచి జరిగే జన్మభూమి కార్యక్రమంలో రుణమాఫీ అంశాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రైతులకు వివరించాలని ఆయన తెలిపారు. రైతులు ప్రభుత్వాన్ని నిలదేసే పరిస్థితి తెచ్చుకోకుండా ముందే రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటుగురించి వారికి వివరించాలన్నారు. తొలివిడతగా 50 వేల రూపాయల రుణమాఫీ చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలోని ఏపీ విద్యార్థులకు ఫీజులిస్తాం
Published Wed, Oct 1 2014 3:37 PM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement
Advertisement