వినరా సర్కారు వీరగాథ..
విశాఖపట్నం: గద్దెనెక్కి ఎనిమిది నెల లైంది.. ఆర్థిక లోటు..జీతాలు కూడా ఇవ్వలేక వందలకోట్ల మేర చెల్లిం పుల నిలిపివేత.. ప్రజలకు మాత్రం భ్రమలు కల్పించేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. ప్రచార ఆర్భాటం కోసం ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు చే స్తోంది. ఇటీవల శ్రీకారం ప్ర చార కళాజాతాలే నిదర్శనం. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అ వగాహన కల్పించడమే ల క్ష్యంగా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన రాష్ర్ట వ్యాప్తంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లాకు మూడు ప్రచార రథాలను కేటాయించారు.
రథం ప్రతీరోజు రెండు గ్రామాలను సందర్శిస్తుంది. ఈ రథంపై ముగ్గురు నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక సాంస్కృతిక బృందాలు గ్రామకూడళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తారు. ప్రదర్శనకు రూ.13వేల చొప్పున చెల్లిస్తు న్నారు. ఈమొత్తంలోనే వాహనం అద్దె, ఆయిల్‌తో పాటు కళాబృందాలకు ప్రదర్శనకు రూ.1800 చొప్పున చెల్లిస్తారు. జిల్లాలో ఒక వాహనానికి రోజుకు రూ.26వేల చొప్పున మూడు వాహనాలకు కలిపి రూ.78వేల చొప్పున ముట్టజెబుతున్నారు. అంటే 40 రోజుల పాటు సాగే ఈ ప్రచార జాతాకోసం ఒక్క మనజిల్లాలోనే రూ.31.20లక్షల ఖర్చు చేస్తు న్నారు. మన రాష్ర్టంలో ఈ కార్యక్రమం కోసం అక్షరాల రూ.4కోట్ల ఐదు లక్షల 60వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వాహనాల కాంట్రాక్టు నుంచి సాంస్కృతిక బృందాల ఎంపిక వరకూ రాష్ర్ట స్థాయిలోనే సంబంధిత శాఖ ఉన్నతాధికారుల కన్నుసన్నల్లోనే జరిగాయని సమాచారం. టెండర్ ప్రక్రియ లేకుండానే అంతానామినేషన్ పద్ధతిలోనే అప్పగించారని చెబుతున్నారు.
ఇందుకోసం భారీగానే చేతులు మారినట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. మరొక పక్క గత ఎనిమిది నెలలు సర్కార్ సాధించేంది ఏమీలేదని ప్రజలే పెదవి విరుస్తున్నారు. పింఛన్ల పెంపు మినహా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనిఅమలుచేసిన పాపాన పోలేదు. అలాంట ప్పుడు ఏం సాధించారని ఈ ప్రచారం చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. సమాచార పౌరసంబంధాల శాఖకు జిల్లా స్థాయిలో కనీసం ప్రోటోకాల్ కాదు కదా.. కనీసం అధికారులు తిరిగే వాహనాలకు ఆయిల్ ఖర్చులకు కూడా నిధులు మంజూరు చేయని దుస్థితి నెలకొంది. .ఇప్పటికైనా లేనిపోని ప్రచార ఆర్భాటాలకు స్వస్తి చెప్పి నిధుల లభ్యతకనుగుణంగా కేటాయింపులు..ఖర్చులు చేస్తే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.