
సాక్షి, అమరావతి : ప్రజా సంక్షేమానికై ఇచ్చిన హామీలు, ఆదేశాలు అమలు విషయంలో కొర్రీల పేరుతో జాప్యం కావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హామీలు, ఆదేశాలు, మంత్రివర్గ నిర‍్ణయాలు త్వరితగతిన అమలయ్యేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిజినెస్ రూల్స్ ప్రస్తావిస్తూ శుక్రవారం ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి హామీల తక్షణ అమలుకై అవుట్ టుడే, మోస్ట్ ఇమ్మీడియేట్, ఇమ్మీడియేట్ అనే మూడు కేటగిరీలుగా విభజించింది.
ఈ క్రమంలో అవుట్ టుడే కేటగిరీ ప్రకారం సీఎం నిర్ణయం తీసుకున్న రోజే జీవో జారీ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మోస్ట్ ఇమ్మీడియేట్ కేటగిరీలో నిర్ణయం తీసుకుంటే 5 రోజుల్లోగా జీవో జారీ చేయాలి. ఇక ఇమ్మీడియేట్ కేటగిరీలో నిర్ణయం తీసుకున్నట్లయితే 15 రోజుల్లోగా జీవో జారీ కావాలి. ఈ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment