సాక్షి, అమరావతి: విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ), ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ప్రజారోగ్య ప్రమాణాలకు తగినట్లుగా లేకపోవటంతో వీటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం పలు ఆసుపత్రిల అభివృద్ధి కోసం రూ.436.96 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవరత్నాల అమలులో భాగంగా సీహెచ్‌సీలను, ప్రాంతీయ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు నిధులు విడుదల చేస్తున్నామని అందులో పేర్కొంది.
రాష్ట్రంలోని మూడు ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి రూ.24.45 కోట్లు, 89 సీహెచ్‌సీల కోసం రూ.399.73 కోట్లు విడుదల చేసింది. ఒంగోలులోని మాతా శిశు ఆసుప్రతికి రూ. 1.76 కోట్లు, అనంతపురంలోని సీడీహెచ్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.11.07 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటి అభివృద్ధికి ఏపీ వైద్య విధాన పరిషత్ తక్షణమే చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment