'భాస్కర నాయుడును తప్పించే యత్నం'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు... వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. ముత్తునూరు జెడ్పీటీసీ శివప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వెంకటాచలం మండలం అక్రమ గ్రానైట్ తవ్వకాల వ్యవహారంలో కీలక సూత్రధారి భాస్కర నాయుడును తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బావమరిది అయిన భాస్కర నాయుడు అధికార పార్టీ అండదండలతో ఈ కేసు నుంచి బయట పడాలని చూస్తున్నారని అన్నారు.