Sarvepalli MLA
-
AP New Cabinet: చరిత్రను తిరగరాసిన నేత కాకాణి
రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో అదృష్టం కాకాణి గోవర్ధన్‌రెడ్డిని వరించింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన రథసారథిగా జిల్లాలో పార్టీని ఏకతాటిపై నడిపించారు. మధ్యలో కొంత కాలం మినహా జిల్లా అధ్యక్షుడిగా, నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా రెండు దఫాలు వైఎస్సార్సీపీని విజయతీరానికి చేర్చారు. తల్లిదండ్రుల వారసత్వంగా రాజకీయ అరంగేట్రం చేసిన కాకాణి ఆది నుంచి ఓటమి ఎరుగని నేతగా ఎదిగారు. తన రాజకీయ చతురతతో ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో దిట్టగా నిలిచారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి చోటు దక్కింది. జిల్లాలో ఆశావహులున్నప్పటికీ అధిష్టానం ఎమ్మెల్యే కాకాణి వైపు మొగ్గు చూపింది. ఆది నుంచి పార్టీకి విదేయుడిగా, జిల్లాపై సమగ్ర అవగాహన, రాజకీయ ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనే ధీశాలిగా ఆయనకు కలిసొచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వైఎస్సార్పీపీ అధికారంలో రాగానే జిల్లా నుంచి దివగంత మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ మంత్రులుగా ప్రాతినిథ్యం వహించారు. మొదటి విడతలో నెల్లూరు జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పోర్టు ఫోలియోలు అప్పగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ జిల్లా తర్వాత ఆ స్థాయిలో మద్దతుగా నిలిచిన జిల్లా అంటే ప్రాణంగా భావిస్తున్నారు. రెండో విడతలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని ముందే ప్రకటించారు. ఆ మేరకు జిల్లా నుంచి ఈ విడతలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణికి అవకాశం దక్కింది. జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా అపార అనుభవం ఉన్న గోవర్ధన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. విధేయత, చతురత ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి పార్టీ పట్ల విధేయుత, రాజకీయ చతురతే మంత్రివర్గంలో స్థానం దక్కిందని చెబుతున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత నుంచి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటి ఉండి నడిచారు. 2011లో వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జిల్లా బాధ్యతలు స్వీకరించారు. మళ్లీ రెండో దఫా 2015 నుంచి ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పార్టీ నుంచి ఎటువంటి పిలుపు వచ్చినా వెంటనే స్పందిస్తూ అందుకు తగ్గట్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ప్రతిపక్షంలో అధికార టీడీపీపై దూకుడు తనం ప్రదర్శించేవారు. ఎప్పు డూ తనదైన శైలిలో వ్యంగోక్తులు విసురుతూ రాజకీయ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాజకీయ ప్రస్థానం జిల్లాలో 2006లో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీగా సైదాపురం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికతో కాకాణి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తన తండ్రి, దివంగత మాజీ సమితి ప్రెసిడెంట్ కాకాణి రమణారెడ్డి రాజకీయ వారసుడుగా తెరపైకి వచ్చిన గోవర్ధన్‌రెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో జెడ్పీ చైర్మన్ గా ఐదేళ్లు జిల్లాలో తన ప్రత్యేకత చాటుకున్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే జెడ్పీ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రత్యేక మెటీరియ ల్స్ తయారు చేసి విద్యను ప్రోత్సహించారు. తర్వాత వైఎస్సార్ కుటుంబం, వైఎస్సార్సీపీ వెంట నడిచి 2014, 2019లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీని రెండు సార్లు విజయతీరానికి చేర్చారు. 2014లో అప్పటి ఉమ్మడి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు, 2019లో 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. చరిత్ర తిరగరాసిన నేత ఈ జిల్లాలో జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన వారికి రాజకీయ భవిష్యత్ ఉండదనే నానుడి ఉంది. ఈ నానుడి చరిత్రను కాకాణి గోవర్ధన్‌రెడ్డి తిరగరాశారనే చెప్పాలి. జెడ్పీ చైర్మన్‌గా పని చేసిన ఆయన 2014, 2019లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఓటమి ఎరుగని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. చదవండి: (Ushashri Charan: కంచుకోటను బద్దలు కొట్టి.. మంత్రి వర్గంలో..) -
‘చంద్రబాబు చుట్టూ విజయ్ మాల్యాలు’
-
‘చంద్రబాబు చుట్టూ విజయ్ మాల్యాలు’
నెల్లూరు: ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయడం సరైందేనని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వాకాటిపై ముందు నుంచే కేసులు ఉన్నా టికెట్ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజల దృష్టిని మరల్చేందుకే వాకాటిని టీడీపీ సస్పెండ్ చేసిందని ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు, సీఎం రమేశ్, రాయపాటి సాంబశిరావులపై కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వాకాటిపై ఆరోపణల గురించి ముందే చెప్పామని, అయినా టికెట్ ఇచ్చి కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులతో ప్రజాప్రతినిధులను భయపెట్టిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు చేయించుకుని క్లీన్చిట్ తెచ్చుకునే ధైర్యం ఉందా అని నిలదీశారు. చంద్రబాబు చుట్టూ వందల మంది విజయ్ మాల్యాలు ఉన్నారని విమర్శించారు. టీడీపీలో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలని కాకాని డిమాండ్ చేశారు. -
'భాస్కర నాయుడును తప్పించే యత్నం'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు... వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ముత్తునూరు జెడ్పీటీసీ శివప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వెంకటాచలం మండలం అక్రమ గ్రానైట్ తవ్వకాల వ్యవహారంలో కీలక సూత్రధారి భాస్కర నాయుడును తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బావమరిది అయిన భాస్కర నాయుడు అధికార పార్టీ అండదండలతో ఈ కేసు నుంచి బయట పడాలని చూస్తున్నారని అన్నారు. -
'అలా చేస్తే కన్నతల్లిని మోసం చేయడమే'
నెల్లూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే ఎమ్మెల్యేలు గెలిచామని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరడం కన్నతల్లిని మోసం చేయడమేనని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ పటిష్టంగా ఉందని తెలిపారు. -
రుణమాఫీపై రైతుల్లో ఆందోళన
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మనుబోలు: రుణమాఫీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తూ గందరగోళం సృష్టిస్తుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మనుబోలు మండల పరిషత్ కార్యాలయం విశ్రాంత మందిరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి షరతులూ పెట్టకుండా రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేశారన్నారు. ఇప్పుడేమో కుటుంబానికి రూ.ఒకటిన్నర లక్ష అని, రీషెడ్యూల్ అని, కమిటీలని ఇలా రోజుకోరకంగా మాట్లాడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ రుణమాఫీపై ఎవరికీ స్పష్టత లేదన్నారు. ఓవైపు రూ.ఒకటిన్నర లక్ష వరకూ రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు రుణాలిచ్చిన బ్యాంకులు రైతులకు వెంటనే చెల్లించాలంటూ నోటీసులు ఇస్తున్నాయన్నారు. మండలంలోని వీరంపల్లికి చెందిన ఎద్దలపూడి ఏడుకొండలు అనే రైతుకు ఇలాగే అతను తీసుకున్న రూ.72 వేల రుణాన్ని వడ్డీతో సహా రెండు వారాల్లో చెల్లించాలని, లేకుంటే బంగారం వేలం వేస్తామంటూ ఎస్బీఐ ఇచ్చిన నోటీసును విలేకరులకు చూపించారు. ఇలాంటి విషయాలను వ్యవసాయమంత్రి దృష్టికి తీసుకెళితే ప్రస్తుతానికి రుణం చెల్లించండి, తరువాత తిరిగి ఇస్తామంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా రుణమాఫీపై బ్యాంకుల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు జయరామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అజయ్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, శేషురెడ్డి, ధనుంజయరెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.