సాక్షి, అమరావతి: మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పిటీషన్‌పై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలను కోర్టుకు వినిపించారు. ఎస్‌ఈసీ సర్వీస్ నింబంధనలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికే ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చట్టాలను చేసే అధికారం ఉందని.. ప్రభుత్వ నిర్ణయాలను చట్ట విరుద్ధంగా చూడలేమన్నారు. కక్ష సాధింపు భాగంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చారనే పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదన్నారు.
(నిమ్మగడ్డ లేఖపై సీఐడీకి అందిన ఫోరెన్సిక్ నివేదిక)
ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని ఎన్నికల కమిషనర్ గా నియమించడం పై విమర్శలు వ్యక్తమయ్యాయని తెలిపారు. గతం లో వివిధ కేసులు విచారణ సందర్బంగా హైకోర్టు కూడా ఎన్నికల కమిషన్ పని తీరు పట్ల అనుమానాలు వ్యక్తం చేసిందని కోర్టుకు వివరించారు. ఎన్నికల సంస్కరణల్లో భాగం గానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. నిష్పక్షపాతం గా ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. రాజ్యాంగ బద్ధ పదవి లో ఉన్న వారి పదవీ కాలాన్ని తగ్గించిన సందర్భాలు ఉంటే కోర్టు ముందుంచాలని అడ్వకేట్ జనరల్ ను ధర్మాసనం ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment